- ఈ నెల 12న వైఎస్‌ఆర్ చేయూత పథకం ప్రారంభం
మహిళా స్వయం సాధికారత దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రఖ్యాత కంపెనీలతో ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంటోది. ఈ క్రమంలోనే హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. సీఎం జగన్ సమక్షంలో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు.. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా పాజిటివ్ వ్యక్తి అత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ముండెపూలంకలో కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అవమానంతోనే ఉరేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో ఏఎఫ్‌సీ పాఠశాలల మూసివేత
ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు కార్పొరేట్‌కు ధీటుగా పురపాలక విద్యాలయాలను తీర్చిదిద్ది జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2016 డిసెంబరులో రాష్ట్రంలో 17 మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ ఫౌండేషన్ కోర్స్ పాఠశాలలు మూతపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌లో 2 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2 కోట్ల 2 లక్షలకు పైగా కరోనా నిర్ధరణ పరీక్షలు పూర్తి చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 3లక్షల 81వేల శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. జులై 30న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 6లక్షల 42వేల పరీక్షలు చేసినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐసోలేషన్‌లో ఐటీ మంత్రి.. కారణమిదే...
ఐటీ, టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. శనివారం సాయంత్రం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నాలుగో నెలా తయారీ రంగం డీలా
కరోనా ప్రభావంతో తయారీ రంగం ఇంకా అనిశ్చితి ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. జులైలోనూ తయారీ రంగ పీఎంఐ తగ్గినట్లు ఓ సర్వే ద్వారా తెలిసింది. పీఎంఐ తగ్గటం ఇది వరుసగా నాలుగో నెల కావడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జైలుపై ఐఎస్ ఉగ్రదాడి- 21 మంది మృతి
అఫ్గానిస్థాన్‌లో ఓ జైలుపై దాడికి పాల్పడింది ఐఎస్ ఉగ్రసంస్థ. ఈ ఘటలో 21 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన సమయంలో కొంతమంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అవకాశమొస్తే మెక్‌గ్రాత్‌తో ఆడతా
ఒకవేళ అవకాశమొస్తే దిగ్గజ బౌలర్ మెక్‌గ్రాత్‌తో ఆడాలనుకుంటున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు. ఓ నెటిజన్ ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు హిట్‌మ్యాన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అభిషేక్ విషయంలో బాధపడుతున్న అమితాబ్
తన కుమారుడు అభిషేక్ బచ్చన్ వేగంగా కోలుకుని, త్వరలో ఇంటికొస్తాడని భావిస్తున్నారు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్. ఈయనకు తాజాగా కరోనా నెగటివ్ వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.