1. రాజధానిలో మంత్రి బొత్స పర్యటన
రాష్ట్ర మంత్రి బొత్స రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రహదారులు, కరకట్ట మార్గం, ఇప్పటివరకూ పూర్తైన నిర్మాణాలు, పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ నిధి
రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నాబార్డు ఛైర్మన్‌గా నియమితులైన తెలుగు వ్యక్తి చింతల గోవిందరాజులు. మొత్తం 2.50 కోట్ల మంది రైతులకు రూ.2 లక్షల కోట్లు రుణాలుగా ఇస్తున్నట్లు ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు . కిసాన్ క్రెడిట్ కార్డుపై ఇచ్చే రుణాల్లో రూ.3 లక్షల వరకు ఎలాంటి రుసుములు వసూలు చేయొద్దని బ్యాంకులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కరోనాతో మారిన బోధన
కరోనా కారణంగా పాఠశాల, కళాశాల విద్యా విధానాల్లో మార్పులొస్తున్నాయి. ఎప్పుడు తెరుచుకుంటాయోననే సందిగ్ధత విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. ఓ పక్క రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు జిల్లాలో పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలను తెరవాలంటే యాజమాన్యాలు భయపడిపోతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మహమ్మారుల సమరంలో ముంబయి గెలిచేనా?
కరోనా మహమ్మారి యావత్ దేశాన్ని పట్టిపీడిస్తోంది. మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో సగానికిపైగా ఒక్క ముంబయి నగరంలోనే నమోదు కావడం ఆ రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. అయితే ముంబయిలో ఇలాంటి భయంకర పరిస్థితి కొత్తేమీ కాదు. అప్పట్లో వచ్చిన ప్లేగు వ్యాధి ఈ నగరాన్ని ఇలాగే అతలాకుతలం చేసింది. మరి ఆ విపత్తును అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది.. ఇప్పటి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పాక్ సైన్యం కాల్పుల్లో భారత్ జవాన్ వీర మరణం
జమ్ముకశ్మీర్‌లోని నౌషిరా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాన్ అమరుడయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భారత జవాన్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. రాజీ వద్దు... ఐకమత్యంగా ఎదుర్కొందాం మోదీజీ
భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ భద్రతపై తాను చెప్పిన మాటల్ని గుర్తుచేసుకోవాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. అమరులైన 20 మంది జవాన్లకు కేంద్రం న్యాయం చేయాలన్నారు మన్మోహన్. వారికి ఏమాత్రం అన్యాయం జరిగినా ప్రజల నమ్మకానికి చారిత్రక ద్రోహం చేసినట్లేనని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఉద్రిక్తతల వేళ ఒకేచోట భారత్, చైనా రక్షణ మంత్రులు
భారత్- చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇరు దేశాల రక్షణ మంత్రులు ఒకే టేబుల్‌పై కూర్చోనున్నారు. మాస్కోలో జరిగే రష్యా విక్టరీ పరేడ్ ఇందుకు వేదిక కానుంది. ఈ సందర్భంగా భారత్- చైనా రక్షణ మంత్రులు మాట్లాడుకునే అవకాశాలున్నాయి. వారి సంభాషణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. రిలయన్స్ రికార్డ్
మార్కెట్ క్యాపిటల్(ఎం-క్యాప్) పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. సోమవారం సెషన్లో సంస్థ షేర్లు 2.5 శాతానికిపైగా వృద్ధి చెంది.. ఎం-క్యాప్ 150 బిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. ఈ స్థాయిని తాకిన తొలి భారతీయ సంస్థ రిలయన్సే కావడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. టాప్ ర్యాంక్ టెన్నిస్ ప్లేయర్‌కు కరోనా
గత వారం ఆడ్రియా టెన్నిస్ టోర్నీలో పాల్గొన్న ప్రముఖ ప్లేయర్ గ్రిగర్ దిమిత్రోవ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఇతడు.. తనను ఈ మధ్య కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. వెళ్లగొట్టిన చోటే బంగ్లా కొన్నాను
32 ఏళ్ల క్రితం తనను ఎక్కడి నుంచైతే వెళ్లగొట్టారో సరిగ్గా అదే చోట ఓ బంగ్లా కొనుగోలు చేసి, ప్రస్తుతం నివసిస్తున్నానని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చెప్పారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.