ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 Am - ఆంధ్రప్రదేశ్ వార్తలు

.

11am top news
11 am ప్రధాన వార్తలు
author img

By

Published : Jun 23, 2020, 11:00 AM IST

1. ఉద్రిక్తతల వేళ లద్దాఖ్​లో సైన్యాధిపతి నరవాణే పర్యటన

భారత ఆర్మీ చీఫ్​ జనరల్‌ ఎమ్​ఎమ్​ నరవాణే ఇవాళ లద్ధాఖ్‌ పర్యటనకు సిద్ధమయ్యారు. వాస్తవాధీనరేఖ వెంబడి క్షేత్రస్థాయి పరిస్థితులపై సైనికాధికారులతో బుధవారం చర్చలు జరపనున్నారు. ఈ మేరకు సైనికవర్గాలు తెలిపాయి. నరవాణే రెండు రోజుల పాటు లద్ధాఖ్​లో పర్యటిస్తారు. గల్వాన్​ లోయ వద్ద ఘర్షణలు మొదలైన తర్వాత సైన్యాధిపతి లద్దాఖ్​కు వెళ్లడం ఇదే మొదటిసారి. చైనా సైన్యాన్ని తరిమికొట్టేందుకు సైనికచర్యను భారత్‌ పరిశీలిస్తోందన్న వార్తల నేపథ్యంలో జనరల్‌ నరవాణే లద్దాఖ్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

2. దేశంలో కరోనా విజృంభన

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. వైరస్​ కారణంగా మరణించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 14,933 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 312 మంది వైరస్​కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. కరోనా మరణాలకు చైనాదే బాధ్యత

కరోనా వైరస్​ అంశంపై మరోమారు చైనాను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించింది శ్వేతసౌధం. వైరస్​ మరణాలకు చైనాదే పూర్తి బాధ్యత అని చెప్పడానికి అధ్యక్షుడు ట్రంప్​ ఎప్పుడూ చింతించరని పేర్కొంది. అదే సమయంలో ట్రంప్​ చేసిన 'కుంగ్​ ఫ్లూ' ఆరోపణలు జాతి వివక్ష వ్యాఖ్యలు కాదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. తెదేపా సానుభూతిపరుడు అరెస్ట్

తెదేపా సానుభూతిపరుడు నలంద కిషోర్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి అవంతి, విజయసాయిరెడ్డిలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులను ఫార్వర్డ్ చేశారంటూ 3 రోజుల కిందట కిషోర్‌కు సీఐడీ నోటీస్ ఇచ్చింది. ఈరోజు తెల్లవారుజామున పోలీసులు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. పదోన్నతలు

రాష్ట్రంలో పలువురు అదనపు ఎస్పీలు, డీఎస్పీలకు పదోన్నతి కల్పిస్తూ...ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు అదనపు ఎస్పీలకు నాన్‌ క్యాడర్‌ ఎస్పీలుగా, 40 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా ప్రమోషన్‌ లభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. రెవెన్యూ లీకేజీపై నిఘా

రాష్ట్రంలో పన్ను ఎగవేతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్టేట్ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. 55 మంది సిబ్బందితో ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. పెట్రో మోత @17వ రోజు.. నేటి ధరలు ఇవే

వాహనదారులపై 17వ రోజూ పెట్రో ధరల భారం మోపాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మంగళవారం లీటర్​ పెట్రోల్ ధర 20 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధర లీటర్​పై 50 పైసలకుపైగా ఎగబాకింది. 17 రోజుల్లో పెట్రోల్ ధర లీటర్​పై రూ.8.50, డీజిల్ ధర లీటర్​పై రూ.10.01 పెరిగింది. వరుస ధరల పెంపుతో దిల్లీ మినహా మిగతా ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర లీటర్​కు రూ.81 నుంచి రూ.86 మధ్య కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

8. స్వల్ప లాభాల్లో సూచీలు

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 70 పాయింట్లు బలపడి 34,980 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల వృద్ధితో 10,340 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. 'భారత్​, పాక్ మ్యాచ్​లను మిస్సవుతున్నా​'

ఓ మ్యాచ్​లో టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ తనతో అన్న మాటలను గుర్తు చేసుకున్నాడు పాక్ క్రికెటర్​ షోయ‌బ్ మాలిక్. ఇరు జట్ల మధ్య స్నేహం, క్రికెట్​ వైరాన్ని మిస్​ అవుతున్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. తెరపై నాని, సాయి పల్లవి జోడీ మరోసారి

'ఎమ్‌.సి.ఎ' చిత్రంతో సందడి చేసిన జోడీ.. నాని, సాయిపల్లవి. ఆ ఇద్దరూ మరోసారి కలిసి నటించబోతున్నారు. నాని కథానాయకుడిగా, రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో 'శ్యామ్‌ సింగరాయ్‌' తెరకెక్కబోతోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం కథానాయికల ఎంపిక జరుగుతోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్​కు చోటుంది. ఓ కథానాయికగా సాయిపల్లవి ఎంపికైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.