- రేణిగుంట విమానాశ్రయంలో గంటకుపైగా లోపలే బైఠాయించిన చంద్రబాబు
తెలుగుదేశం అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు విమానాశ్రయంలోపలే బైఠాయించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 'ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా?'
చిత్తూరు జిల్లాలో తెదేపా నేతల గృహనిర్బంధంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం
మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అన్ని పార్టీల నుంచి మఖ్యనేతలు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాకాల వైకాపా నేతపై దాడి చేసింది... సొంత పార్టీ నేతలే!
చిత్తూరు జిల్లా పాకాల వైకాపా నేతపై దాడి చేసిన దుండగులను పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్ర వైకాపా సేవాదళ్ కార్యదర్శి కుమారుడే ఈ దాడి చేశాడని పోలీసులు తెలిపారు. మరో ఆరుగురిని అదుపుాలోకి తీసుకున్నారు. సొంతపార్టీలో విభేదాలే ఘటనకు కారణమని వారు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రోడ్టు పక్కన రెస్టారెంట్లో అమిత్ షా భోజనం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తమిళనాడు విల్లుపురం జాతీయ రహదారిపై ఉన్న రెస్టారెంట్లో భోజనం చేశారు. అనుకోని అతిధిలా వచ్చిన కేంద్ర మంత్రిని చూసిన అక్కడి వారు ఆశ్యర్యపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వెంబడించి మరీ బైక్‌ను ఢీకొట్టిన పోలీసు వాహనం
ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులను పోలీసులు 1.5కిమీ వెంబడించి మరీ ఢీకొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియో కోసం క్లిక్ చేయండి.
- సెలబ్రిటీల ట్వీట్స్ ఇక ఫ్రీగా చూడలేం!
మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్.. కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫీచర్స్ ద్వారా వారి వారి ఇష్టాలను బట్టి ఏదైనా గ్రూప్‌ను రూపొందించటం లేదా గ్రూప్‌లో జాయిన్ అవ్వొచ్చని పేర్కొంది. అంతేకాక అదనపు సమాచారం కావాలంటే ఫాలోవర్లు నగదు చెల్లించేలా 'సూపర్ ఫాలోస్' పేరుతో పేమెంట్ ఫీచర్‌ను తీసుకు రానున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అరుదైన బటన్లతో మ్యూజియం.. ఎక్కడంటే?
కొందరు రకరకాల గడియారాలను సేకరిస్తుంటారు. మరికొందరు పాత కరెన్సీ నోట్లను సేకరిస్తుంటారు. ఇదే తరహాలో అరుదైన బటన్స్‌ను సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఓ మహిళ. అందుకోసం ఏకంగా 16 ఏళ్లపాటు శ్రమించారు. విభిన్నమైన బటన్లు సేకరించి ఓ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆమె ఎవరు? ఆ మ్యూజియం ఎక్కడ ఉంది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రేక్షకులు లేకుండానే చివరి మూడు టీ20లు
స్వదేశంలో ఆసీస్‌తో జరగాల్సిన చివరి మూడు టీ20లను ఖాళీ స్టేడియాల్లో జరపాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కరోనా కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అల్లరి నరేశ్ పేరు మార్చుకో.. నాని సలహా
థియేటర్లలో 'నాంది' సినిమా విశేషాదరణ లభిస్తున్న దృష్ట్యా హీరో అల్లరి నరేశ్‌ను మెచ్చుకున్నారు నాని. పేరు మార్చుకోవాలని అతడికి సూచిస్తూ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.