ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM

ప్రధాన వార్తలు @ 11 AM

9 am top news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : Feb 5, 2021, 10:58 AM IST

Updated : Feb 5, 2021, 11:03 AM IST

  • సీఎం జగన్‌కు తెలంగాణ కోర్టు సమన్లు

ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరుకావాలని హైదరాబాద్‌ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సమన్లు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తొలి దశలో 517 పంచాయతీలు ఏకగ్రీవం.. చిత్తూరులోనే అత్యధికం

పంచాయతీ పోరులో ఏకగ్రీవాలపై స్పష్టత వచ్చింది. 12 జిల్లాల్లో మొత్తం 3,249 గ్రామాలకుగానూ... 517 చోట్ల పోటీ లేకుండానే విజయం ఖరారైంది. కొన్ని పంచాయతీల్లో అభ్యర్థులు చివరి క్షణంలో నామినేషన్లు ఉపసంహరించుకోగా.. మరికొన్ని చోట్ల ఒప్పందాలు కుదిరాయి. ఏకగ్రీవాల్ని మినహాయిస్తే తొలిదశలో 2,732 పంచాయతీల్లో పోటీ నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అపహరణకు గురైన సామకోటవారిపల్లి సర్పంచి అభ్యర్థి క్షేమం!

అపహరణకు గురైన చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం సామకోటవారిపల్లి సర్పంచి అభ్యర్థి ఓబుల్‌రెడ్డి క్షేమంగా ఉన్నారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను రాత్రి సమయంలో వచ్చి స్థానిక బస్టాండ్​లో వదిలేసి వెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. లింగాయపాలెం రైతు నిమ్మగడ్డ వెంకట్రావు రాజధాని నిర్మాణానికి 1.25 ఎకరాలు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రూ. 30 కోట్లు విలువ చేసే హెరాయిన్ స్వాధీనం

హిమాచల్​ప్రదేశ్​లో రూ. 30 కోట్లు విలువ చేసే హెరాయిన్​ను​ పట్టుకున్నారు పోలీసులు. ఈ ఆపరేషన్​ను​ దిల్లీ, కులు పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 1.23 లక్షల ఖాతాల్లో రూ.62,500 కోట్లు

ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువగా ఈపీఎఫ్ చందా జమ చేస్తే.. అధిక మొత్తంపై వడ్డీ వసూలు చేయాలని కేంద్రం బడ్జెట్​లో ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన వెనకున్న కారణాలు ఏమిటి? దీనితో ఎవరిపై ప్రధానంగా ప్రభావం పడనుంది? అనే వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రెపో, రివర్స్​ రెపో రేట్లు యథాతథం: ఆర్​బీఐ

భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని అన్నారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​. వచ్చే ఆర్థిక సంవత్సరం 10.5 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేశారు. రెపో రేటు, రివర్స్​ రెపో రేటును యథాతథంగా ఉంచనున్నట్లు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మిత్రదేశాలతో సంబంధాలు పునరుద్ధరిస్తాం: బైడెన్​

ప్రపంచదేశాలతో మైత్రిని పెంపొందించుకునేందుకు సమాయత్తమవుతున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై ఉమ్మడి పోరు అవసరమని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోహ్లీ 31లోనైనా 71 చేరుకుంటాడా?

2019 నవంబర్​ నుంచి ఇప్పటివరకు టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క సెంచరీ చేయలేదు. బ్యాట్​ పడితే పరుగుల వరద పారించే కోహ్లీ.. ఏడాదికి పైగా ఒక్క శతకమూ సాధించకపోవడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. అయితే ఇంగ్లాండ్​తో జరిగే తొలి టెస్టులో అయినా అతడు సెంచరీ చేస్తాడని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐకానిక్​ పాత్రలు వదులుకున్న అగ్రనటులు!

మన అభిమాన తారలు నటించిన కొన్ని పాత్రలు ఎప్పటికీ మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారిని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఆ పాత్రలే కళ్ల ముందు మెదులుతుంటాయి. అయితే, కొంతమంది మాత్రం అలాంటి అపురూప పాత్రలను వదులుకున్నారు. అలా మంచి పాత్రలను కోల్పోయిన నటులెవరో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

Last Updated : Feb 5, 2021, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.