ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 Am - ఏపీ వార్తలు

.

11am top news
11 Am ప్రధాన వార్తలు
author img

By

Published : Jun 22, 2020, 10:59 AM IST

1. జేసీ ప్రభాకర్, అస్మిత్ విచారణ పూర్తి

బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్​ వ్యవహారంలో పోలీసు కస్టడీలో ఉన్న జేసీ ప్రభాకర్​రెడ్డి, అస్మిత్​రెడ్డిల విచారణ పూర్తైంది. పోలీసు విచారణను తప్పుబట్టిన ప్రభాకర్​రెడ్డి.. ఈ కేసులో మిగిలిన వారిని కూడా ప్రశ్నించి.. తప్పు ఎక్కడ జరిగిందో తేల్చాలని డిమాండ్​ చేశారు. తాను కొనని వాహనాలను సైతం తానే కొన్నట్లుగా పోలీసులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. కొన్ని జిల్లాల్లో సాధారణంగా... మరికొన్ని జిల్లాల్లో స్వల్పంగా!

ఖరీఫ్ మొదలై మూడు వారాలు గడిచింది. నాలుగు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ, ఆరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాయలసీమలో కర్నూలు మినహా లోటు వర్షపాతమే ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పది రోజుల నుంచి చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం వరకు సగటున 73.8 మి.మీ వర్షం కురిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. చదువు సాగేదెలా?

పాఠశాలలు తిరిగి తెరిచేదెప్పుడు? అసలు ఈ విద్యా సంవత్సరం ఉంటుందా? ప్రస్తుతం తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులందరిలోనూ ఇదే చర్చ. మామూలు రోజుల్లోనే పాఠశాలలకు వెళ్లి వచ్చే పిల్లలు అక్కడి పరిస్థితుల వల్ల రకరకాల అనారోగ్యాలకు గురవుతుంటారు. అలాంటిది కరోనా సమయంలో వాళ్లను పంపేదెలాగన్న ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. తబ్లీగీ విదేశీయుల నిషేధంపై సుప్రీంలో పిటిషన్లు

తబ్లీగీ జమాతే కార్యకలాపాల్లో భాగస్వామ్యమైన 3,500 మందికిపైగా విదేశీయులను 10 ఏళ్లపాటు భారత్​లోకి రాకుండా నిషేధించటాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేయాలని కోరారు. మొదటగా 960 మందిపై నిషేధం విధిస్తూ ఏప్రిల్​ 2 ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. ఆ తర్వాత మరో 2,500 మందికిపైగా నిషేధిస్తూ జూన్​ 4న ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. కరోనా కోరల్లో భారత్

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. వైరస్​ కారణంగా మరణించే వారి సంఖ్య కూడా అధికమవుతోంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 14,821 కేసులు నమోదయ్యాయి. మరో 445 మంది వైరస్​కు బలయ్యారు. దేశంలో మొత్తం కొవిడ్-19 బాధితుల సంఖ్య 4,25,282కు చేరింది. ఇప్పటి వరకు కరోనా కాటుకు 13,699 మంది బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. ప్రభుత్వ వసతి గృహంలో 57 మందికి కరోనా

ఉత్తర్​ప్రదేశ్ కాన్పూర్​లోని ఓ ప్రభుత్వ శిశు వసతి గృహంలో 57 మందికి కరోనా​ సోకింది. వైరస్​ సోకిన వారిలో ఐదుగురు బాలికలు గర్భంతో ఉన్నట్లు పాలనాధికారి తెలిపారు. అక్కడ మొత్తం ఏడుగురు అమ్మాయిలు గర్భంతో ఉండగా.. మిగతా ఇద్దరికి వైరస్​ నెగెటివ్​గా తేలింది. వైరస్​ నిర్ధరణ అయిన ఐదుగురు అమ్మాయిలు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి పోక్సోచట్టం కింద వసతి గృహంలో చేరారని అక్కడి శిశు సంక్షేమ కమిటీలు పేర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. కరోనాతో గడగడలాడుతున్న ప్రపంచం

ప్రపంచంపై కరోనా కరాళనృత్యం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్​ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అన్ని దేశాలు ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం లక్షా 83వేలకుపైగా కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది. ఒక్క రోజులో 4వేల 743మంది ప్రాణాలు కోల్పొయినట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 260 పాయింట్లకుపైగా లాభంతో 34,993 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 70 పాయింట్లకుపైగా వృద్ధితో 10,317 వద్ద ట్రేడవుతోంది. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో హెవీ వెయిట్ షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. వీటికి తోడు అంతర్జాతీయంగా సానుకూలతలు కొనసాగుతుండటం లాభాలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. ఈసారి కోహ్లీని స్లెడ్జింగ్ చేయను

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై ఇక మీదట స్లెడ్జింగ్​ చేయనని చెప్పాడు ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​. భారత్​తో డిసెంబరులో జరగనున్న టెస్టు సిరీస్ కోసం​ తాను ఆసక్తి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​ జరగకపోతే ఐపీఎల్​ ఆడేందుకు తనతో పాటు ఆసీస్​ క్రికెటర్లంతా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. శ్రీదేవి బయోపిక్​లో నటించాలనేది నా కల

అతిలోకసుందరి శ్రీదేవి బయోపిక్​లో నటించాలనేది తన డ్రీమ్​రోల్​ అని చెప్పిన హీరోయిన్​ పాయల్​ రాజ్​పుత్​... ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.