ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - recent news

ప్రధాన వార్తలు @ 1 PM

1 pm top ten news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : Mar 11, 2021, 12:59 PM IST

  • గుడివాడలో మహా శివరాత్రి వేడుక.. ముఖ్యమంత్రి జగన్ పూజలు

కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్‌ స్టేడియంలో మహా శివరాత్రి వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. ముఖ్యమంత్రి జగన్.. పరమశివుడి లింగానికి అభిషేకం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెదేపా నేత కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు

మున్సిపల్ ఎన్నికల విధి నిర్వహణలో ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో మచిలీపట్నంలో అరెస్టైన తెదేపా నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు.. జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి.

  • మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ప్రత్యేక సమావేశం: ఎస్​ఈసీ

మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సిందిగా ఎస్‌ఈసీ ఆదేశాలు ఇచ్చింది. 12 నగరపాలికల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం సమావేశం ఏర్పాటు చేయాలని పురపాలకశాఖను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భగవద్గీత స్ఫూర్తితో ​టీకా సాయం​: మోదీ

భగవద్గీత స్ఫూర్తితో.. ప్రపంచ దేశాలకు భారత్​ కరోనా టీకా సాయం చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గీత నుంచి స్ఫూర్తి పొందినవారు ఎల్లప్పుడూ కరుణతో ఉంటారని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టీఎంసీ మేనిఫెస్టో విడుదల వాయిదా.. కారణమిదే..

బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​.. తన ఎన్నికల మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసింది. టీఎంసీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బుధవారం దాడి జరిగిన నేపథ్యంలో.. ఆ పార్టీ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భార్యపై అనుమానంతో కాలు, చెయ్యి నరికిన భర్త

భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. చివరకు ఆమె కాలు, చెయ్యి నరికేశాడు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమె.. పదిహేను రోజులకోసారి ఇంటికి రావడం సహించలేకే ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కెనడా టొరంటో బిల్​ బోర్డులపై మోదీ

కొవిడ్ టీకా డోసులను సాయం చేసినందుకు గాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కెనడాలో కృతజ్ఞతలు వెల్లివిరిసాయి. గ్రేటర్​ టొరంటోలోని బిల్​బోర్డ్స్​పై మోదీకి ధన్యవాదాలు చెబుతూ ప్రకటనలు ప్రదర్శించారు అక్కడి అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'మా అవసరాలు తీరాకే ఇతర దేశాలకు టీకా'

తమ అవసరాలకు మించి టీకాల ఉత్పత్తి జరిగితే ప్రపంచదేశాలకు అందిస్తామని అమెరికా వెల్లడించింది. ఈ మేరకు అమెరికన్ల భద్రతకు తొలి ప్రాధాన్యతనిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. కరోనాపై పోరులో భాగంగా ప్రపంచ దేశాలకు కరోనా టీకా అందించేందుకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ది మొతేరా థాలీ ఛాలెంజ్​'కు మీరు సిద్ధమా!

భారత్​-ఇంగ్లాండ్ టీ20 సిరీస్​కు సరికొత్త ఛాలెంజ్​ను అభిమానుల ముందుకు తీసుకొచ్చింది స్టార్​ స్పోర్ట్స్​ సంస్థ. అహ్మదాబాద్​లోని ఓ హోటల్​లో 'ది మొతేరా థాలీ ఛాలెంజ్​' పేరుతో తిండి పోటీలను ప్రకటించింది. అభిమానులు ఎవరైనా వీటిలో పాల్గొనవచ్చని తెలిపింది. తాజాగా ఈ సవాల్​ను భారత మాజీ ఓపెనర్ పార్థివ్​ పటేల్​ స్వీకరించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఈశ్వర' సాంగ్ ప్రోమో.. 'టక్ జగదీష్' సాంగ్ అప్​డేట్

నేచురల్ స్టార్ నాని 'టక్ జగదీష్'​లోని మరో పాట విడుదలకు ముహూర్తం కుదిరింది. అలాగే 'మోసగాళ్లు' కొత్త పోస్టర్ విడుదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.