- బడ్జెట్ 2021-22
లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.
- మౌలిక రంగానికి భారీగా నిధులు- 34.5శాతం పెంపు
మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పెట్టుబడి వ్యయాన్ని 34.5 శాతాన్ని పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సైతం... గత బడ్జెట్లో ప్రతిపాదించిన వ్యయంతో పోలిస్తే అధికంగా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బడ్జెట్ ప్రత్యేక యాప్ ఫీచర్లు ఇవే..
కరోనా నేపథ్యంలో ఈ సారి బడ్జెట్ ప్రతులు ముద్రించలేదు ఆర్థిక శాఖ. సామాన్యులు బడ్జెట్ వివరాలు సులభంగా తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. ఆ యాప్ ఎలా వాడాలి? ఎలాంటి సమాచారం యాప్ నుంచి పొందొచ్చు? ఈ వివరాలు తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- సింహద్వారం ఒక జిల్లాలో... ఇల్లు మరో జిల్లాలో!
సింహద్వారం ఒక జిల్లాలో... ఇల్లు ఉండేది మరో జిల్లాలో... ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? తూర్పు గోదావరి- విశాఖ జిల్లా సరిహద్దు గ్రామాలైన.. భీమవరపుకోట, వైబీ పట్నంలో ఇది సాధ్యమే మరి..! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'పంచాయతీ పోరులో తెదేపా విజయబావుటా ఎగురవేయాలి'
పంచాయతీ ఎన్నికల్లో తెదేపా విజయబావుటా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. తెదేపా హయంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని పలువురు నేతలు సూచించారు. నామినేషన్ల సమయంలో వైకాపా దౌర్జన్యకాండను వారు వ్యతిరేకించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెబల్స్ బుజ్జగింపులకు నేతల మధ్యవర్తిత్వం
గుంటూరు జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తెనాలి డివిజన్‌లోని గ్రామ పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ముగిసింది. సింహభాగం గ్రామాల్లో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడంతో పల్లెపోరు ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సంగీతంపై ప్రేమతో.. అసలు పాట పదిలంగా..
ఘంటసాల గాత్రం, ఎంఎస్ సుబ్బలక్ష్మి సుప్రభాతం, ఉస్తాద్బడేగులాం అలీఖాన్ హిందూస్థానీ సంగీతం ఎన్నిసార్లు విన్నా.. సగటు సంగీత ప్రియుడి తనివి తీరదు. రేడియో, సినిమా, గ్రామ్‌ఫోన్ రూపంలో ఆపాత మధురాలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా కొద్ది.. పాటల అసలు స్వరూపం కనుమరుగవుతోంది. ఈ పరిణామం ముందే ఊహించిన హైదరాబాద్‌కు చెందిన ఓ సీనియర్ రైల్వే అధికారి.. ప్రతిపాటను దాని అసలు రూపంలోనే పదిలంగా దాచుకుంటున్నాడు. అదెలాగో తెలియాలంటే క్లిక్ చేయండి.
- మయన్మార్ సైనిక చర్యపై ప్రపంచ దేశాల ఆందోళన
మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. తాము ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య ప్రక్రియకు మద్దతుగా ఉంటామని తెలిపింది. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్న అమెరికా.. నిర్బంధంలోని నేతలను విడుదల చేయాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. సైనిక చర్యను ఐరాస ఖండించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇంగ్లాండ్‌తో టెస్టుకు జట్టును ప్రకటించిన జాఫర్
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 5న టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ జట్టుతో బరిలో దిగితే బాగుంటుందంటూ తన జట్టును ప్రకటించాడు మాజీ ఆటగాడు వసీం జాఫర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విరుష్క జోడీ కూతురు పేరేంటంటే?
ఇటీవలే టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ, అనుష్క జోడీకి ఆడబిడ్డ జన్మించింది. తాజాగా ఆమెకు పేరు పెట్టారు. వామికగా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.