ETV Bharat / city

HCU: హెచ్​సీయూలో అతిపెద్ద ల్యాబ్ ఏర్పాటు - Largest lab in hcu

హానికర వైరస్‌లు, బ్యాక్టీరియా సహా గాలి ద్వారా సోకే అంటువ్యాధులపై పరిశోధనలకు మార్గం సుగమం కానుంది. అధునాతన సదుపాయాలతో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)లో బయోసేఫ్టీ లెవల్‌(బీఎస్‌ఎల్‌)-3 ల్యాబ్‌ నెలాఖరుకు అందుబాటులోకి రానుంది. దేశంలోనే తొలిసారిగా సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ఇలాంటి ప్రయోగశాల మొదలు కానుండటం విశేషం. బీఎస్‌ఎల్‌-3తోపాటు ఏబీఎస్‌ఎల్‌(యానిమల్‌ బయోసేఫ్టీ లెవల్‌)-3 ల్యాబ్‌నూ ఇక్కడ సిద్ధం చేస్తుండటం గమనార్హం.

Central University of Hyderabad
హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం
author img

By

Published : Aug 2, 2021, 8:30 AM IST

కేంద్ర బయో టెక్నాలజీ విభాగం(డీబీటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ(ఎన్‌ఐఏబీ), హెచ్‌సీయూ సంయుక్తంగా బీఎస్‌ఎల్‌-3 ల్యాబ్‌ను నెలకొల్పాయి. సీసీఎంబీలో ఉన్నదాని కన్నా మిన్నగా.. సుమారు రూ.12 కోట్ల వ్యయంతో 3వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనికి రూపమిచ్చారు. ఏడేళ్ల కిందటే ల్యాబ్‌ నిర్మాణానికి అప్పటి ఉపకులపతి రామకృష్ణ రామస్వామి శంకుస్థాపన చేసినా.. వివిధ కారణాలతో పనులు ముందుకు సాగలేదు. తర్వాత మాజీ ఉపకులపతి ప్రొ.పొదిలె అప్పారావు, వర్సిటీ లైఫ్‌సైన్సెస్‌ డీన్‌ ప్రొ.దయానంద సిద్దావత్తం, బయోకెమిస్ట్రీ ఆచార్యులు ప్రొ.శర్మిష్ఠ బెనర్జీ నిరంతర కృషితో ఇప్పటికిది సేవలందించేందుకు సిద్ధమైంది.

పూర్తి భద్రత ప్రమాణాలతో..

ప్రమాదకర వైరస్‌, బ్యాక్టీరియా, ప్రొటోజువా ఇతర సూక్ష్మజీవులపై ప్రయోగాలు అన్ని ప్రయోగశాలల్లో సాధ్యపడదు. ప్రభుత్వాలూ అందుకు అంగీకరించవు. అనుకోకుండా వైరస్‌ లీకైతే మానవాళికి పెనుముప్పుగా మారుతుంది. కేవలం బీఎస్‌ఎల్‌-3 సదుపాయాలున్న ప్రయోగశాలల్లోనే ప్రయోగాలకు అనుమతి ఉంటుంది. ఇకపై హెచ్‌సీయూలో ఆ తరహా ప్రయోగాలకు సానుకూలత లభించనుంది. పూర్తి భద్రత ప్రమాణాలతో దీన్ని తీర్చిదిద్దారు. స్వయంచాలిత(ఆటోమేటిక్‌) విధానంలో ఇది పనిచేయనుంది.

వ్యాక్సిన్‌ టెస్టింగ్‌కు కీలకం..

ప్రస్తుతం హైదరాబాద్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి కీలక కేంద్రంగా మారింది. వ్యాక్సిన్ల టెస్టింగ్‌(ఛాలెంజింగ్‌ ప్రయోగాల)కు నగరంలో సదుపాయాలు లేవు. ఇందుకోసం పుణె లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీయూలో సిద్ధం చేస్తున్న ఏబీఎస్‌ఎల్‌-3 ల్యాబ్‌ అలాంటి అవసరాలకు అక్కరకొస్తుందని ఆచార్యులు తెలిపారు.

ఎన్నో ప్రత్యేకతలు..

రిఫ్రిజిరేటర్

* ఎలుకలు, ఉడతలు, ఇతర చిన్న జంతువులపైనా ప్రయోగాలు చేసేందుకు ఏబీఎస్‌ఎల్‌-3 ల్యాబ్‌లో సౌకర్యాలు, ప్రత్యేక ఛాంబర్లు ఉన్నాయి.

* మైనస్‌ 80 డిగ్రీల ఉష్ణోగ్రతతో పనిచేసే రిఫ్రిజిరేటర్‌, ట్రైనొక్యులర్‌ ఇన్‌వర్టెడ్‌ మైక్రోస్కోపీ, సెంట్రిఫ్యూజ్‌ వంటి యంత్రాలున్నాయి.

* ఇక్కడ వినియోగించే ప్రతిదీ అత్యంత వేడి వాతావరణం ఉండే ఆటోక్లేవ్‌ ఛాంబర్‌లో వెళుతుంది.

* ల్యాబ్‌ లోపలి గాలి బయటకు వెళ్లకుండా.. బయటిది లోనికి రాకుండా ఆటోమేటిక్‌ లాకింగ్‌ తలుపులు ఏర్పాటు చేశారు.

15న లేదా నెలాఖరుకల్లా వినియోగంలోకి...

అత్యాధునిక సదుపాయాలు, పూర్తి భద్రత ప్రమాణాలతో ల్యాబ్‌ను తీర్చిదిద్దాం. బీఎస్‌ఎల్‌, ఏబీఎస్‌ఎల్‌-3 ల్యాబ్‌లకు అతిత్వరలోనే ఆర్‌సీజీఎం నుంచి అనుమతులు రానున్నాయి. అవి రాగానే ఈనెల 15 లేదా నెలాఖరుకల్లా వినియోగంలోకి తీసుకొస్తాం.

ప్రొ.దయానంద సిద్దావత్తం, డీన్‌, లైఫ్‌సైన్సెస్‌, హెచ్‌సీయూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.