తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి క్షేత్రంలో అనుమతి లేకుండా యాదాద్రి గర్భాలయంలోకి ఇటీవల కొందరు వ్యక్తులు ప్రవేశించడానికి సహకరించిన ఆలయ సిబ్బందికి, అర్చకులకు ఈవో గీతారెడ్డి మెమోలు జారీ చేశారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులు జరుగుతున్న కాలంలో గర్భాలయంలోకి అధికారుల ముందస్తు అనుమతి లేకుండా వెళ్లకూడదనే నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటికి విరుద్ధంగా ప్రవర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
పది రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు అర్చకులు, ఇద్దరు అటెండర్లు, ఒక అధికారి ఉన్నారు.
ఇదీ చూడండి: శానిటైజర్ చేతులకే కాదు...ఇలా కూడా వాడొచ్చా!