ETV Bharat / city

రమేశ్ కుమార్ ను పునర్నియమించలేదు.. ఎందుకు? : హైకోర్టు

enquiry in the High Court on the non-appointment of Nimmagadda ramesh kumar as SEC
ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించకపోవడంపై హైకోర్టులో విచారణ
author img

By

Published : Jul 17, 2020, 11:25 AM IST

Updated : Jul 18, 2020, 9:23 AM IST

11:21 July 17

ఎస్ఈసీ కేసులో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. 'రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనను నియమించాలని ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందంటూ'... నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా కొనసాగించాలన్న తమ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మూడుసార్లు నిరాకరించినా... ఎందుకు ఆయనను నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. మరోవైపు తన పునఃనియామకంపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాలని రమేష్‌కుమార్‌కు కూడా కోర్టు సూచించింది. హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిందిగా గవర్నర్‌ను కోరాలని నిమ్మగడ్డకు చెప్పింది. ఇప్పటికే ఒకసారి గవర్నర్‌ సమయం కోరామని... నిమ్మగడ్డ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. గవర్నర్‌ను కలిసిన తర్వాత జరిగిన పరిణామాలను తమ దృష్టికి తేవాలని కూడా హైకోర్టు పేర్కొంది. ఈ లోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా మార్చి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంతో ఈ వివాదం మొదలైంది. రమేష్‌కుమార్‌ ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలు వాయిదా వేశారని ఆరోపించిన ప్రభుత్వం... ఎస్‌ఈసీ పదవీకాలాన్ని తగ్గించేలా నెలరోజుల వ్యవధిలోనే ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి నిమ్మగడ్డను పదవి నుంచి తొలగించింది. తనను తప్పించడం రాజ్యాంగ విరుద్ధమంటూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తూ నాడు తీర్పునిచ్చిన హైకోర్టు... రమేష్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా నియమించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు నిలుపుదల కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా... దీనిపై మూడుసార్లు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.... స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

ఇదీ చదవండి: 

జేసీ ప్రభాకర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Last Updated : Jul 18, 2020, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.