ETV Bharat / city

electricity charges : అప్పుడు విమర్శించారు.. ఇప్పుడు పెంచేశారు - ఏపీ విద్యుత్ చార్జీల పెంపు

electricity charges : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ... అన్ని విషయాల్లో ప్రజలపై ‘బాదుడే బాదుడు’ అని ధ్వజమెత్తిన జగన్‌.. ఇప్పుడు అదే విద్యుత్‌ ఛార్జీలను బాదేసి అన్ని వర్గాల ప్రజల నడ్డివిరిచారు. కరెంటు ఛార్జీల పెంపుతో గృహ వినియోగదారులపై ప్రభుత్వం మోపిన భారం ఏడాదికి రూ.1,400 కోట్లు. శ్లాబ్‌ల కుదింపు మాయాజాలంతో ప్రజలపై పడే వాస్తవభారం మరింత ఎక్కువన్నది విద్యుత్‌రంగ నిపుణుల అంచనా.

electricity charges
electricity charges
author img

By

Published : Mar 31, 2022, 4:53 AM IST

electricity charges : ప్రతిపక్ష నేత హోదా నుంచి ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చిన అదే జగన్‌... ఇప్పుడు కరెంటు ఛార్జీల్ని పెంచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ... అన్ని విషయాల్లో ప్రజలపై ‘బాదుడే బాదుడు’ అని ధ్వజమెత్తిన జగన్‌.. ఇప్పుడు అదే విద్యుత్‌ ఛార్జీలను బాదేసి అన్ని వర్గాల ప్రజల నడ్డివిరిచారు. అసలే ధరలన్నీ పెరిగిపోయి, కొవిడ్‌ సంక్షోభంతో ఆదాయాలు తగ్గి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే... అన్ని వర్గాలపైనా కరెంటు ఛార్జీల కత్తి ఝళిపించారు. గతంలో విమర్శల నేపథ్యంలో నిలిపివేసిన ట్రూ అప్‌ ఛార్జీలనూ తెరపైకి తెచ్చారు. ఏపీఈఆర్సీ ఛైర్మన్‌ అధికారికంగా చెప్పిన ప్రకారమే... కరెంటు ఛార్జీల పెంపుతో గృహ వినియోగదారులపై ప్రభుత్వం మోపిన భారం ఏడాదికి రూ.1,400 కోట్లు. శ్లాబ్‌ల కుదింపు మాయాజాలంతో ప్రజలపై పడే వాస్తవభారం మరింత ఎక్కువన్నది విద్యుత్‌రంగ నిపుణుల అంచనా.

అందరూ బాధితులే: గృహ వినియోగదారుల్లో ఏ కేటగిరీనీ వదల్లేదు. ప్రస్తుత విధానంలో వినియోగదారుల్ని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజిస్తున్నారు. ప్రతి కేటగిరీలో వేర్వేరు శ్లాబులు ఉన్నాయి. కొత్త విధానంలో... టౌన్‌షిప్‌లు, కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు మినహా మిగతా గృహ వినియోగదారులందరినీ ఒకే కేటగిరీగా చేశారు. ఆరు శ్లాబ్‌లే పెట్టారు. యూనిట్‌ ధరను కనిష్ఠంగా 45 పైసల నుంచి, గరిష్ఠంగా రూ.1.57 వరకు పెంచేశారు.

ప్రస్తుతం ‘ఎ’ కేటగిరీలో 0-50 శ్లాబ్‌కు యూనిట్‌ ధర రూ.1.45, 51-75 శ్లాబ్‌కు రూ.2.60గా ఉండగా... దీన్ని సరాసరి చేస్తూ 0-30 శ్లాబ్‌కు ప్రస్తుత యూనిట్‌ ధరను రూ.1.45గా పేర్కొంది. కానీ ప్రస్తుతం 0-30 శ్లాబే లేదు! తక్కువ శ్లాబ్‌లు పెట్టి, వినియోగదారుల్లో ఎక్కువమంది పై శ్లాబ్‌లలోకి వచ్చేలా చేసి, వారి ముక్కుపిండి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడమే లక్ష్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు పాలనకు ముందు మనింట్లో కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయి? 50.. 60 రూపాయలు.. బాగా అయితే 100. ఇప్పుడు ఎంత వస్తున్నాయి? రూ.500, 700, 1000! కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయని, వస్తూనే తగ్గిస్తానన్న ఇదే పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక ఎడాపెడా... కరెంటు ఛార్జీలు 3 సార్లు పెంచారు’ - 2017 డిసెంబరులో అనంతపురం జిల్లా కదిరి బహిరంగ సభలో జగన్‌

విద్యుత్తు బిల్లులను ముట్టుకుంటేనే షాక్‌ కొడుతున్నాయ్‌ అధ్యక్షా! చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు రూ.150 వచ్చే విద్యుత్తు బిల్లు ఇప్పుడు రూ.500- రూ.600 వస్తోంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పేదలు, ఎస్సీ, ఎస్టీలున్నారు.- అసెంబ్లీలో 2017 మార్చి 7న జగన్‌ వ్యాఖ్యలు

నాన్న (వైఎస్‌) హయాంలో కరెంటు రూ.3కి దొరుకుతుంటే రాష్ట్రానికి పరిశ్రమలు విచ్చలవిడిగా వచ్చాయి. ఇవాళ అదే కరెంటు రూ.8కి ఎగబాకితే ఉన్న కరెంటు బిల్లులు కట్టలేక పరిశ్రమలన్నీ పూర్తిగా మూసేస్తున్నారు.- 2018లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో జగన్‌

30 యూనిట్లు అసంబద్ధం: కొత్త విధానంలో మొదటి శ్లాబ్‌నే 0-30 యూనిట్లుగా నిర్ణయించడమే అసంబద్ధం. పైగా 75 యూనిట్లలోపు వాడేవారు 50% ఉంటారని చెప్పడం ఇంకా విడ్డూరం. పేదలెవరైనా కనీసం నెలకు 200 యూనిట్లు వాడతారని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ చెప్పారు. మరి నెలకు 30 యూనిట్లే వాడేవారు ఎవరుంటారు? ఒక బల్బు, ఒక ఫ్యాన్‌ వాడినా నెలకు అంతకంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగమవుతుంది. అలాంటప్పుడు 0-30 యూనిట్ల శ్లాబ్‌కు 45 పైసలే పెంచామని చెప్పడం కంటే అసంబద్ధత ఏముంటుంది?

అడిగిన దానికంటే పెంచడమేంటి?: 2022-23 ఆర్థిక సంవత్సరానికి మూడు డిస్కంల ఆదాయ అవసరాలు, ధరల ప్రతిపాదనను బట్టి, ప్రస్తుత ధరల వద్ద వాటి లోటు రూ.10,932.99 కోట్లని, గృహ వినియోగదారులకు డిస్కంలు చేసిన విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనతో ఆ లోటు రూ.10,045.61 కోట్లుగా ఉంటుందని ఏపీఈఆర్సీ పేర్కొంది. ఈ రెండింటి మధ్య తేడాయే.. గృహ వినియోగదారులపై డిస్కంలు ప్రతిపాదించిన రూ.887.38 కోట్ల భారం.కానీ, ఏపీఈఆర్సీ వేసింది రూ.1400 కోట్లు. వాస్తవానికి ఛార్జీలు నిర్ణయించేది ఏపీఈఆర్సీయే అయినా ప్రభుత్వం అందిచ్చే రాయితీలను బట్టే విద్యుత్‌ టారిఫ్‌ పెంపు ఆధారపడుతుంది. రాయితీ పెరిగితే టారిఫ్‌ తగ్గుతుంది. అవి అంతగా లేనప్పుడే ఈ స్థాయిలో పెరుగుతాయన్నది విద్యుత్‌ రంగ నిపుణుల మాట.

ట్రూఅప్‌ ఛార్జీల మోత అదనం: 2014-15 నుంచి 2018-19 వరకు వినియోగదారుల నుంచి వసూలు చేసిన ఛార్జీలకు, విద్యుత్‌ ఉత్పత్తి వ్యయానికి మధ్య అంతరాన్ని రూ.2,910.74 కోట్లుగా ప్రభుత్వం లెక్కగట్టింది. ఆగస్టు నుంచి ఆ మొత్తం వసూలు చేసుకునేందుకు డిస్కంలకు ఏపీఈఆర్సీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

...

కొత్త ఛార్జీల అమలు తేదీపైనా కుప్పిగంతులు: కొత్త ఛార్జీల్ని ఆగస్టు నుంచి అమల్లోకి తెస్తామని డిస్కంలు తమ నివేదికలో పేర్కొన్నాయి. కానీ దానికి భిన్నంగా ఏప్రిల్‌ నుంచే కొత్త టారిఫ్‌లను అమల్లోకి తేవాలని నిర్ణయించాయి. అంటే 4 నెలల ముందు నుంచే వినియోగదారుల నడ్డి విరిచేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి.

పేదలు ఎవరైనా నెలకు 200 యూనిట్లపైనే విద్యుత్తు వినియోగిస్తారు. మూడు ట్యూబు లైట్లు ఉంటే 47 యూనిట్లు, రెండు ఫ్యాన్లు ఉంటే 55-60 యూనిట్లు, ఒక టీవీ ఉంటే 80 యూనిట్లు, సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ ఉంటే 40 యూనిట్ల విద్యుత్తు వాడతారు. అలాంటిది 200 యూనిట్లకు మించి విద్యుత్తు వినియోగిస్తే యూనిట్‌కు రూ.6.75 అంటూ షాక్‌ కొట్టేలా రేట్లు పెట్టారు. ఇంత రేట్లు తమిళనాడు, కర్ణాటకల్లోనూ లేవు. - అసెంబ్లీలో 2015 మార్చి 24న తెదేపా ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్‌

ఇదీ చదవండి: రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు.. ఎంత పెరిగాయంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.