ETV Bharat / city

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ 6 వారాల పాటు నిలిపివేత - notifications for panchayath elections

elections-postpone
elections-postpone
author img

By

Published : Mar 15, 2020, 10:14 AM IST

Updated : Mar 15, 2020, 1:18 PM IST

10:08 March 15

ఎన్నికల ప్రక్రియ 6 వారాల పాటు నిలిపివేత

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ 6 వారాల పాటు నిలిపివేత

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆరు  వారాల పాటు వాయిదా వేసింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత సమీక్ష నిర్వహించి.. ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌ వెల్లడించారు. పార్టీలు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించిన అనంతరం ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. 

‘కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఊహించని మార్పులు వచ్చాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పేపర్‌ బ్యాలెట్‌ వల్ల కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. విధిలేని పరిస్థితుల్లోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నాం. పార్టీలు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆరు వారాల తర్వాత సమీక్ష చేపడతాం. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే ఎన్నికలు నిర్వహిస్తాం. ఆరు వారాల తర్వాత ఎన్నికల ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుంది'                                  - రమేశ్ కుమార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్

కోడ్‌ కొనసాగుతుంది..

ఎన్నికల ప్రక్రియ వాయిదా పడినప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి కొనసాగుతుందని రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు కొనసాగుతారని తెలిపారు. 

అలా వ్యవహరించడం బాధాకరం

స్థానిక ఎన్నికల ప్రక్రియలో చోటు చేసుకున్న పరిణామాలు బాధాకరమని ఎన్నికల కమిషనర్ రమేశ్​కుమార్ అన్నారు. స్థానిక పోలీసుల వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉందని వ్యాఖ్యానించారు. 

‘స్థానిక ఎన్నికల ప్రక్రియలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లలో జరిగిన పరిణామాలు బాధాకరం. బెదిరింపులు, అడ్డుకున్న దృశ్యాలు మాధ్యమాల్లో వచ్చాయి. కొందరు అధికారులపై చర్యలు తీసుకోవడం అనివార్యంగా భావిస్తున్నాం. అధికార యంత్రాంగం పూర్తి పక్షపాతంగా వ్యవహరించడం బాధాకరం. మాచర్ల దాడిలో పాల్గొన్న నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. స్థానిక పోలీసుల వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉంది’ -రమేశ్ కుమార్ 

ఇదీ చదవండి : గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ వేటు

Last Updated : Mar 15, 2020, 1:18 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.