స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు (Local body quota MLC elections) రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (SEC) నోటిఫికేషన్ జారీ చేశారు. విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండు స్థానాల చొప్పున.. అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒక్కో స్థానానికి నోటిఫికేషన్ ఇచ్చారు. నేటి నుంచి నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించారు.
ఈనెల 23 వరకు నామినేషన్ల (Naminations) స్వీకరణ జరగనుంది. 24న నామినేషన్ల పరిశీలన.. 26వ తేదీ ఉపసంహరణకు తుది గడువుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబరు 10న పోలింగ్ (Polling) జరుగుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ (Counting) నిర్వహించనున్నారు.
డిసెంబరు 16న ఓట్ల లెక్కించి.. అదే రోజు ఫలితాలను విడుదల చేయనున్నారు. నేటినుంచి ఆయా జిల్లాల్లో ఎన్నికల నియమావళి (Election Code) అమల్లోకి వస్తుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: