ETV Bharat / city

జర్నలిస్టులపై విరుచుకుపడుతున్న కరోనా

జర్నలిస్టులపై కరోనా పంజా విసురుతోంది. శుక్రవారం రోజున నిజామాబాద్​కు చెందిన ఇద్దరు పాత్రికేయులు కొవిడ్ సోకి మరణించారు. తాజాగా కరీంనగర్​లో 'ఈనాడు'లో పనిచేస్తున్న సీనియర్ ఉప సంపాదకుడు ఎండీ రంజాన్ అలీ(56) మహమ్మారి బారిన పడి మృతి చెందారు.

corona
జర్నలిస్టులపై కరోనా
author img

By

Published : Apr 25, 2021, 10:01 AM IST

ప్రముఖ దినపత్రిక ‘ఈనాడు’లో పనిచేస్తున్న సీనియర్‌ ఉప సంపాదకుడు ఎండీ రంజాన్‌ అలీ(56) శనివారం రాత్రి కరీంనగర్‌లో మృతి చెందారు. కరోనా సోకడంతో ఆయన వారం రోజులుగా కరీంనగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి రాత్రి 10.15 గంటలకు తుది శ్వాస విడిచారు.

విశాఖపట్నంలోని అక్కాయపాలెం ప్రాంతానికి చెందిన ఆయన 1996లో ‘ఈనాడు’లో ఉపసంపాదకుడిగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం కరీంనగర్‌లో సీనియర్‌ ఉప సంపాదకుడిగా పనిచేస్తున్నారు. గతంలో వరంగల్‌, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలలో పనిచేశారు. ఆయనకు భార్య ఉస్నారా బీబీ, కుమారుడు రిజ్వాన్‌, కుమార్తె హీనా కౌసర్‌ ఉన్నారు. కుమారుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కుమార్తె వైజాగ్‌లోని ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో చదువుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.