ETV Bharat / city

విరామం మంచిది కాదు.. ఆ ప్రాంతాల్లో పాఠశాలలు తెరవొచ్చు - ఏపీలో స్కూల్స్ రీఓపెన్ న్యూస్

వేసవి సెలవుల అనంతరం ఏటా పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఉపాధ్యాయులు పాఠాలు చెబుతారు. పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాలొస్తాయి. మళ్లీ వేసవి సెలవులు...తర్వాత కొత్త విద్యా సంవత్సరం... అసలు పిల్లల అభ్యాసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయి?...ఉపాధ్యాయులు ఏం చెబుతున్నారు? ఎలా చెబుతున్నారు? బోధనా విధానాల్లో మార్పులు చేస్తున్నారా? పాఠ్య ప్రణాళిక ఎలా ఉంది? ఏముంది?...ఇలాంటి వాటిపై సమాజంలో చర్చ జరగడం అత్యంత అరుదు. ఈ విషయాలపై విద్యావేత్తలు ఈనాడుతో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

విరామం మంచిది కాదు.. ఆ ప్రాంతాల్లో పాఠశాలలు తెరవొచ్చు

author img

By

Published : Jul 20, 2020, 7:49 AM IST

కరోనా కారణంగా అన్ని వర్గాల్లో విద్యా సంక్షోభంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. బడి తెరుచుకుంటుందా? చదువు సాగుతుందా? అన్న ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఈ సందర్భంలో ‘పాఠశాల విద్యారంగం- సవాళ్లు- అవకాశాలు’ అనే అంశంపై ‘ఈనాడు’ వెబినార్‌ నిర్వహించింది. అందులో పాల్గొన్న విద్యావేత్తలు మాత్రం ఇది విద్యా సంక్షోభం కాదని... అవకాశంగా భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు. ఈ విద్యా సంవత్సరం నడవకుండా చేయాలనుకోవడం సరికాదన్నారు. ప్రత్యామ్నాయ విద్యా బోధన మార్గాలు, విద్యా బడ్జెట్‌, సాంకేతికత వినియోగం, అభ్యాసన సామర్థ్యాలు, బోధనా సిబ్బంది నియామకాలు, మౌలిక వసతులు లాంటి ఎన్నో అంశాల్లో ఉన్న లోపాలపై సమాజం చర్చిస్తుంటే ప్రభుత్వాలు సైతం వాటిని సరిచేయక తప్పదని వారు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం అన్నివర్గాలతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇప్పుడు ఆన్‌లైన్‌ తప్పదు

విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ
విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ

సున్నా విద్యా సంవత్సరం చేయకూడదు. తరగతి గది బోధనకు ఆన్‌లైన్‌ ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పదు. ఎక్కువ సమయం నిర్వహించకూడదు. అందరికీ ట్యాబ్‌లున్నాయా? అంతర్జాలం ఉందా? అంటున్నారు. అందుకే విద్యార్థుల మధ్య సాంకేతిక వైషమ్యాలను తగ్గించాలి. సాధారణంగా జూన్‌ 12న తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. కరోనా వచ్చినా, రాకపోయినా అప్పటికే పుస్తకాల పంపిణీ పూర్తికావాలి. ఈ సమయానికే విద్యార్థుల ఇళ్లకు పుస్తకాలు, వర్క్‌బుక్సు చేరిపోవాలి. పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర గ్రంథాలయ పుస్తకాలిస్తే పిల్లలు పుస్తక ప్రపంచంలో ఉంటారు. - విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ, ఏపీ

ప్రత్యేక ఛానెల్‌ ప్రారంభించాలి

ఉపేందర్‌రెడ్డి, విశ్రాంత ఆచార్యుడు
ఉపేందర్‌రెడ్డి, విశ్రాంత ఆచార్యుడు

99 శాతం మంది ఇళ్లల్లో టీవీలున్నాయి. అందుకే విద్యా బోధన కోసం, పాఠాల ప్రసారానికి ప్రత్యేక ఛానల్‌ పెట్టాలి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాలి. ప్రతి రోజు ఒక తరగతికి బోధన చేయాలి. తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ గ్రామీణ అభ్యాసన కేంద్రాలను ప్రారంభిస్తోంది. ఆ విధానాన్ని అవలంబించొచ్చు. ఎంపీ ఫౌండేషన్‌, వందేమాతరం తదితర సంస్థల సహకారం కూడా తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. - ఉపేందర్‌రెడ్డి, విశ్రాంత ఆచార్యుడు,ఎస్‌సీఈఆర్‌టీ, హైదరాబాద్‌

ఆన్‌లైన్‌కు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి

ఆనంద్‌ కిశోర్‌, మాజీ సంచాలకులు, ఎస్‌సీఈఆర్‌టీ

ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ తరగతులపై శిక్షణ ఇవ్వాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మన టీవీ కోసం 2 వేల పాఠాలు సిద్ధం చేశారు. వాటిని మార్పు చేసి వినియోగించుకోవాలి. ఏపీలో సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఆన్‌లైన్‌ విద్య కోసం విద్యార్థులకు ఆయా పరికరాలు, వస్తువులు అందజేయాలి. విద్య విషయంలో గ్యాప్‌ రాకూడదు. వస్తే అభ్యాసన సామర్థ్యాలు పూర్తిగా పడిపోతాయి. ప్రైవేటులో నాణ్యమైన విద్య ఉంటుంది... ప్రభుత్వ బడుల్లో ఉండదనే అభిప్రాయం తప్పు. విదేశాల్లో నాణ్యమైన విద్యాసంస్థలన్నీ ప్రభుత్వ సంస్థలే. ఇప్పుడు సవాల్‌గా స్వీకరించి సర్కారు బడులు నిరూపించుకోవాలి. పాఠ్యాంశాలను తగ్గించేటప్పుడు అభ్యాసన ఫలితాలకు నష్టం జరగకుండా చూడాలి.

- ఆనంద్‌ కిశోర్‌, మాజీ సంచాలకులు, ఎస్‌సీఈఆర్‌టీ, హైదరాబాద్‌

సొంతంగా నేర్చుకునే విధానానికి మంచి అవకాశం

పరిమి, వికాస్‌ విద్యావనం పాఠశాల నిర్వాహకుడు

ఇప్పటి వరకు పాఠాలు వినడం, చదువుకోవడం, బట్టీ విధానాన్ని పిల్లలకు అలవాటు చేశారు. ఇప్పుడు సొంతంగా నేర్చుకునేందుకు ఓ మంచి అవకాశం వచ్చిందని భావించి.. అవలంబించాలి. ఎలక్ట్రిక్‌ వస్తువులపై ఆసక్తి చూపే చిన్నారులు సైతం ఆన్‌లైన్‌ తరగతులంటే భయపడిపోతున్నారు. 1-5 తరగతుల విద్యార్థులకు ఈ విధానానికి బదులు ఇంటికే పుస్తకాలు అందించాలి. ప్రాథమిక స్థాయి పిల్లలకు ప్రకృతిపై అవగాహన కల్పించాలి. మా పాఠశాలలో మూడు, నాలుగు తరగతుల పిల్లల తల్లిదండ్రులకు ఐదేసి ఆంగ్ల, తెలుగు మాధ్యమ పుస్తకాలు ఇస్తున్నాం. గతంలో నేర్చుకున్న అంశాలను పునఃశ్చరణ చేస్తూ రెండు వారాలకు మళ్లీ పుస్తకాలు అందిస్తున్నాం. దీన్ని ఒక రకంగా దూరవిద్యగా చెప్పొచ్చు. ఐదారుగురితో వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసి, సమాచారాన్ని అందించాలి. - పరిమి, వికాస్‌ విద్యావనం పాఠశాల నిర్వాహకుడు, విజయవాడ, ఏపీ

విద్యావేత్తల ముఖ్య సూచనలివీ...

  • ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యామ్నాయ విధానం ఏంటో ప్రభుత్వానికి స్పష్టత ఉండాలి.
  • కరోనా లేనిప్రాంతాల్లో పాఠశాలలు తెరవొచ్చు. ఉపాధ్యాయులు వంతులవారీగా, తరగతులను విడతలువిడతలుగా నిర్వహించాలి.
  • ఆన్‌లైన్‌తో పాటు దూరవిద్యా విధానం పాటించాలి.
  • ఏపీలో అమ్మఒడి కింద ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తున్నారు. దీని కింద ఈ ఏడాది ట్యాబ్‌లు ఇస్తే అందరికీ వస్తాయి.
  • కేరళలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు సమానంగానే ఆన్‌లైన్‌ బోధన సాగిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం సాంకేతికత సమానత్వాన్ని తీసుకొచ్చింది. అక్కడ స్థానిక యువత, ఉపాధ్యాయుల సహాయంతో సామాజిక స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేశారు. ఈ పద్ధతి అనుసరణీయం.
  • 45 నిమిషాల ఆన్‌లైన్‌ బోధనలో 30 నిమిషాలు పాఠాలు బోధించాలి. మిగతా సమయం విద్యార్థుల సందేహాలు తీర్చడానికి, చర్చ జరపడానికి కేటాయించాలి.
  • పూర్వ ప్రాథమిక విద్యలో తల్లిదండ్రులకు ఎక్కువ శిక్షణ ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో ఒకరోజు బడి, ఇంకో రోజు ఇంటి వద్ద బోధన చేయాలి.

ఇదీ చదవండి : తూర్పుగోదావరి, శ్రీకాకుళం మధ్య చీలిక గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.