కరోనా ప్రభావం వల్ల తెలంగాణలో సుదీర్ఘంగా మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 9, 10వ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 9, 10 తరగతుల క్యాలెండర్‌ను విద్యాశాఖ ప్రకటించింది.
మార్చి 15 నుంచి అసెస్‌మెంట్-1 పరీక్షలు, ఏప్రిల్ 15 నుంచి అసెస్‌మెంట్-2 పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మే 7 నుంచి 13 వరకు సమ్మెటీవ్ అసెస్‌మెంట్ పరీక్షలు.. మే 17 నుంచి 26 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. మే 27 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులుగా ప్రకటించింది.
ఇదీ చదవండి: పాక్పై 1971 విజయానికి 50 ఏళ్లు.. నేవీ ప్రత్యేక వీడియో