EAPCET EXAM 2022: ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్ పరీక్షలు నేటి నుంచి జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 7.30 గంటలు, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి అనుమతిస్తామని.. అభ్యర్థులు ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఇంజినీరింగ్‌కు నేటి నుంచి 8వ తేదీ వరకు, 11 నుంచి 12 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాలకు సంబంధించిన రూట్ మ్యాప్‌ని హాల్ టికెట్‌తో పాటు ఇస్తారు. హాల్ టికెట్‌తో పాటు ఫొటోతో ఉన్న గుర్తింపు కార్డును తీసుకువెళ్లాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలను పరీక్ష కేంద్రాల వద్దనే సమర్పించాలి. ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీ లేకపోవడంతో.. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయిస్తారు.
ఇవీ చదవండి: