ETV Bharat / city

పదీ అబ్బాయిలకే.. ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో టాప్‌టెన్‌ ర్యాంకుల కైవసం - ఏపీ ఎంసెట్‌ ఫలితాలు తాాజా వార్తలు

ఏపీఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో అబ్బాయిల హవా కొనసాగింది. ఈ ఏడాది ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాల్లో మొదటి పది ర్యాంకులు వారే కైవసం చేసుకున్నారు. వ్యవసాయ విభాగంలో తొలి 10 ర్యాంకర్లలో ముగ్గురు అమ్మాయిలున్నారు. ఇంజినీరింగ్‌లో తొలి 10 ర్యాంకుల్లో ఐదుగురు, వ్యవసాయ విభాగంలో టాప్‌టెన్‌లో ఇద్దరు తెలంగాణవారున్నారు. ఏపీ ఎంసెట్‌-2020 ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో శనివారం విడుదల చేశారు. ఎంసెట్‌లో వైద్య విద్య లేనందున వచ్చే ఏడాదికి ఎంసెట్‌ పేరును మార్పు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, వ్యవసాయంలో 91.77 శాతం మంది అర్హత సాధించారు. గత మూడేళ్లతో పోల్చితే అర్హత సాధించిన వారి సంఖ్య పెరిగింది.

eamcet results 2020
eamcet results 2020
author img

By

Published : Oct 11, 2020, 6:41 AM IST

తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్సుడ్‌లో ర్యాంకులు సాధించిన వారిలో కొందరు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ మొదటి 10 ర్యాంకుల్లో నిలిచారు. జేఈఈ అడ్వాన్సుడ్‌లో 173వ ర్యాంకర్‌ వావిలపల్లి సాయినాథ్‌ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించారు. అడ్వాన్సుడ్‌లో 2, 14 ర్యాంకర్లు గంగుల భువన్‌రెడ్డి, లండ జితేంద్ర ఎంసెట్‌లో 3, 10 ర్యాంకులు సాధించారు. తెలంగాణకు చెందిన కుమార్‌సత్యం జేఈఈ అడ్వాన్సుడ్‌లో 22వ ర్యాంకు సాధించగా ఎంసెట్‌లో రెండో ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఇంజినీరింగ్‌లో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన విద్యార్థులందరూ ఐఐటీల ప్రవేశాలపైనే ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ విభాగంలోని మొదటి ఐదుగురు నీట్‌లో ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్‌లో చేరతామని వెల్లడించారు.

వెయిటేజి ఇలా..

ఇంటర్మీడియట్‌లో 45 శాతం మార్కులు సాధించిన ఓసీ విద్యార్థులు, 40 శాతం మార్కులు తెచ్చుకున్న రిజర్వేషన్‌ కేటగిరీల విద్యార్థులకే ఎంసెట్‌లో ర్యాంకులు కేటాయించారు. ఎంసెట్‌ మార్కులకు 75 శాతం, ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చారు. అడ్వాన్సుడ్‌ సఫ్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారికి ప్రస్తుతం ర్యాంకులు కేటాయించలేదు. వీరికి ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఎంసెట్‌ ర్యాంకు కార్డులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

కృష్ణా, గుంటూరు నుంచే అత్యధికం..

ఏపీ ఎంసెట్‌లో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌లో కృష్ణా జిల్లా నుంచి అత్యధికంగా 18,457 మంది పరీక్షకు హాజరవగా.. 15,785 మంది అర్హత సాధించారు. గుంటూరు జిల్లా నుంచి 18,491 మందికిగానూ.. 15,433 మంది ఉత్తీర్ణులయ్యారు. వ్యవసాయ విభాగంలో గుంటూరు జిల్లా తొలి స్థానంలో నిలిచింది. మొత్తం 8,129 మంది పరీక్ష రాయగా 7,489 మంది అర్హులయ్యారు. కృష్ణా నుంచి 7,798 మంది రాయగా 7,447 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌, వ్యవసాయం రెండు విభాగాల్లోనూ విజయనగరం జిల్లా నుంచి అత్యల్ప ఉత్తీర్ణత నమోదైంది.

eamcet results 2020
ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్ ఫలితాలు
eamcet results 2020
ఏపీ ఎంసెట్‌ వ్యవసాయ విభాగంలో

ఇదీ చదవండి: నేడు గ్రామీణ ప్రాపర్టీ కార్డుల పంపిణీ ప్రారంభించనున్న మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.