రాష్ట్రంలోని 47 పురపాలక, నగరపాలక సంస్థల్లో ఈ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీన్ని అధిగమించేందుకు రూ.50 కోట్లు అవసరమని పురపాలకశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మోటార్లు, పైపులైన్లు మరమ్మతులు, కొత్త బోర్లు ఏర్పాటు, ట్యాంకర్లతో నీటి సరఫరాకు నిధులు ఖర్చు చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక, నగరపాలక సంస్థల్లో కంటే ప్రకాశం, చిత్తూరు జిల్లాలో సమస్య తీవ్రంగా ఉండనుందని అంచనా. తిరుపతి, కడప, ఒంగోలు, విజయనగరం, మచిలీపట్నం నగరపాలక సంస్థలతోపాటు మరో 27 పట్టణాల్లో ఇప్పటికే రెండు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారు.
సమస్య ఉండే ప్రాంతాలు..
ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి పురపాలక సంఘాల్లో నీటి ఎద్దడి తలెత్తనుంది. వీటిలో ట్యాంకర్లతో నీటి సరఫరాకు రూ.15 కోట్లుకుపైగా అవసరం. చిత్తూరు నగరపాలక సంస్థతోపాటు ఇదే జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం పురపాలక సంఘాల్లోనూ సమస్య తీవ్రంగా ఉంటుంది. ట్యాంకర్లకు రూ.10 కోట్లు అవసరం. నెల్లూరు జిల్లాలో కావలి, గూడురు పురపాలక సంఘాల్లో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉండటంతో ట్యాంకర్లతో నీటి సరఫరాకు రూ.32.62 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఇదీ చదవండి
వైరస్ ప్రభావం త్వరలో తారస్థాయికి: డాక్టర్ గగన్‌దీప్ కాంగ్