అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్... తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిటిషనర్‌ను అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. దర్యాప్తు మాత్రం కొనసాగించాలని చెప్పింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని సీఐడీకి ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.
సంబంధిత కథనాలు