ETV Bharat / city

అమూల్ కోసం ప్రభుత్వ సొమ్ము వాడొద్దు: హైకోర్టు - అమూల్ పై హైకోర్టులో వాదనలు

అమూల్ పాల సేకరణ, వ్యాపార అవసరాల కోసం ఏవిధమైన సామ్ము ఖర్చు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. అమూల్ డెయిరీ (గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ పెడరేషన్ లిమిటెడ్ ) ఎండీ, నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) చైర్మన్, ఒంగోలులోని ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ (పీఎంపీసీఎల్) ఎండీకి నోటీసులు జారీ చేసింది. విచారణను ఈనెల 14 కు వాయిదా వేసింది.

అమూల్ కోసం ప్రభుత్వ సోమ్ము వాడొద్దు: హైకోర్టు

author img

By

Published : Jun 5, 2021, 2:26 AM IST

Updated : Jun 5, 2021, 9:16 AM IST

అమూల్ పాల సేకరణ, వ్యాపార అవసరాల కోసం ఏవిధమైన సొమ్ము ఖర్చు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. అమూల్ డెయిరీ (గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ పెడరేషన్ లిమిటెడ్ ) ఎండీ, నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) చైర్మన్, ఒంగోలులోని ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ (పీఎంపీసీఎల్) ఎండీకి నోటీసులు జారీ చేసింది. విచారణను ఈనెల 14 కు వాయిదా వేసింది. ఈలోపు రాష్ట్రంలో అమూల్ సంస్థ పాల సేకరణ, మార్కెటింగ్ అవసరాల కోసం.. రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ , అమూల్ డెయిరీ మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ఆధారంగా ఏవిధమైన సొమ్మునూ ఖర్చుచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ డి.రమేశ్​తో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

ఎంపీ రఘరామ పిటిషన్...
ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ ఆస్తులను లీజు విధానంలో అమూల్ సంస్థకు బదలాయించే నిమిత్తం గతనెల 4 న ఏపీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని చట్ట రాజ్యంగా విరుద్దమైనదిగా ప్రకటించాలని ఎంపీ రఘరామకృష్ణరాజు హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ, అమూల్ డెయిరీ మధ్య జరిగిన అవగాహన ఒప్పందాన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం గతేడాది జులై 21 న ఇచ్చిన జీవో 25నూ చట్ట విరుద్ధమైనిగా ప్రకటించాలన్నారు. ఏపీ డెయిరీకి సంబంధించిన ఆస్తుల లీజు రెంట్​ను ఖరారు చేసే విషయంలో కమిటీ ఏర్పాటునకు సంబందించిన జీవో5, ఆ కమిటీ చేసిన సిఫారుసులను చెల్లుబాటు కానివిగా నిర్ణయించాలని విన్నవించారు. ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ కు రూ .6 కోట్లు లోన్ మంజూరు నిమిత్తం రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ఈ ఏడాది మార్చి 23 న జారీచేసిన జీవో 68 ఏకపక్ష నిర్ణయంగా, కంపెనీ, చట్ట నిబంధనలకు విరుద్ధమైనిగా ప్రకటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఉద్యోగులను అమూల్ వ్యాపార విషయంలో వినియోగించకుండా ఏపీ సీఎస్, ఏపీ డెయిరీశాఖ ప్రత్యేక సీఎస్, ఏపీ డెయిర్ డెవలప్​మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్లను ఆదేశించాలని కోరారు. దీనిపై ఈనెల 3 న హైకోర్టులో విచారణ జరిగింది.

పథకాలు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు

ఎంపీ తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.' అమూల్ సంస్థ ఏపీలో వ్యాపారం నిర్వహించకూడదని మేం అనడం లేదు. అయితే వారి వ్యాపారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ధనం, వనరులను వినియోగించడం అభ్యంతరకరం. అమూల్ సంస్థకు పాలు పోయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారు. అమూల్ పాల వెల్లువ..అని ఓ ప్రైవేట్ సంస్థ పేరుతో ప్రచారం చేస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అమూల్ పాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడమేంటి? రాష్ట్రంలో పాల ఉత్పత్తి దారుల్ని, ప్రైవేట్ డెయిరీలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది' అని చెప్పారు. ప్రభుత్వ సోమ్మును, ఉద్యోగులను..అమూల్ కోసం వినియోగించకుండా నిలువరించాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ.. ఎంపీ వేసిన వ్యాజ్యానికి అర్హత లేదన్నారు. పాల ఉత్పత్తి దారులైన 30 లక్షల మంది మహిళలకు ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇప్పటికే ఈ వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేశామన్నారు. ఆ దస్త్రం హైకోర్టు రిజిస్ట్రీకి చేరలేదన్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

జగన్.. టీకాల సరఫరాపై ప్రధానిని ఎందుకు ప్రశ్నించరు..? జైరామ్‌ రమేశ్‌

Last Updated : Jun 5, 2021, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.