ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా పింఛన్, రేషన్ కార్డుల పంపిణీ

రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక నాయకులు, అధికారులు తమ పరిధిలో ఉన్న లబ్ధిదారులకు ఈ కార్డులు అందించారు. జగనన్న పాలనలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని పలువురు నేతలు పేర్కొన్నారు.

Distribution of pension and ration cards throughout the state
రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం
author img

By

Published : Jun 20, 2020, 7:23 PM IST

కృష్ణా జిల్లాలో...
జగ్గయ్యపేటలో నూతనంగా మంజూరైన 113 వైఎస్ఆర్ పింఛన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

కడప జిల్లాలో...
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా అన్నారు. కడప 47వ డివిజన్ అక్కాయపల్లిలోని మరాటి వీధిలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో నూతన ఒరవడి సృష్టిస్తోందన్నారు.

అనంతపురం జిల్లాలో...
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నూతన పెన్షన్ కార్డులు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీచదవండి.

కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని.. మంత్రిగారి గన్​మెన్​ వీరంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.