ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 30 లక్షల 75 వేల గృహ నిర్మాణాలు - కృష్ణా సమాచారం

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అధికారులు అందజేశారు. అనంతరం వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

Distribution of house deeds in state wise
రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 30 లక్షల 75 వేల గృహా నిర్మాణాలు
author img

By

Published : Jan 2, 2021, 10:21 PM IST

Updated : Jan 2, 2021, 11:04 PM IST

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో లబ్ధిదారులకు అధికారులు ఇళ్ల పట్టాలను అందజేశారు.

కృష్ణాలో..

కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతాలలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హాజరయ్యారు. గ్రామంలోని 64 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. అనంతరం వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అంతకుముందు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

విశాఖలో..

విశాఖ జిల్లా, రోలుగుంట మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ హాజరయ్యారు. మండల పరిదిలోని వివిధ పంచాయతీలకు చెందిన 184 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. పేదలైన అక్కచెల్లెళ్ల సొంతింటి కల నిజం చేసేందుకు సీఎం జగన్ చేపట్టిన ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు కోర్టు ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఈ పథకంతో రాష్ట్రంలో మరిన్ని ఊళ్లు తయారవుతాయని అన్నారు. కాలనీలకు దశలవారీగా వసతులు సమకూర్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైకాపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

అనంతపురంలో..

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని వెంకటగిరి పాళ్యం, శెట్టిపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శంకరనారాయణ పాల్గొన్నారు. అనంతరం వెంకటగిరి పాళ్యంలో 52, శెట్టిపల్లిలో 105 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాలనీలు మాత్రమే కాకుండా.. ఊర్లనే నిర్మించే విధంగా పట్టాల పంపిణీ జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమానికి పెనుకొండ తహసీల్దార్, వైకాపా నేతలు, తదితరులు హాజరయ్యారు.

పశ్చిమ గోదావరిలో..

పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పశ్చిమ గోదావరిలోని ఆచంట మండలంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి రంగనాథ రాజు హాజరయ్యారు. కొడమంచిలి, ఆచంట, వేమవరం, బాలంవారి పాలెం గ్రామాల్లోని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

25 నుంచి మూడో స్థానానికి..

ఇళ్ల నిర్మాణాల కోసం ముఖ్యమంత్రి స్వయంగా డిజైన్ చేసి రూపకల్పన చేశారన్నారు మంత్రి రంగనాథ రాజు. ప్రతి ఇంటికీ కిచెన్, పడకగది, వరండా, హాల్​తో పాటు.. రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, త్రీపిన్ ప్లగ్లు వంటి సదుపాయాలు ఉండాలని సీఎం ఆదేశించారు. అందుకోసం ప్రతి ఇంటికి సింటెక్స్ వాటర్ ట్యాంక్, భవిష్యత్తులో అదనపు అంతస్థు వేసుకునే సదుపాయాలతో పటిష్ఠంగా నిర్మాణాలు చేపడుతున్నామని వెల్లడించారు.

ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయి..

కుల, మత, రాజకీయాలకతీతంగా అర్హతే కొలమానంగా ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమానికి.. ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుతగులుతున్నాయి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని.. సచివాలయాల ద్వారా నిజం చేస్తున్నాము. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారు. - రంగనాథ రాజు, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 238 మందికి కరోనా.. ముగ్గురు మృతి

Last Updated : Jan 2, 2021, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.