ఇంటి వద్దకే నిత్యావసర సరకుల పంపిణీ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా రేషన్ బళ్లను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇవి రాజస్తాన్ లో తయారు అయ్యాయి. వాటిని గూడ్స్ రైలు బండి ద్వారా రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఇలాంటి రైలు ఒకటి ఆదివారం డోర్నకల్ మీదుగా రావడంతో రైల్వేస్టేషన్ సిబ్బంది, ప్రయాణికులు, ట్రాక్‌కు ఇరుపక్కలా ఉండే పల్లెల ప్రజానీకం ఆసక్తిగా తిలకించారు. రైలాగిన చోట ముచ్చటపడి స్వీయ చిత్రాలు దిగారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్ రైల్వేస్టేషన్‌లో గూడ్స్ రైలు ఆగిన సందర్భంగా ఈనాడు కెమెరా క్లిక్‌మనిపించింది.
ఇదీ చదవండి: