ETV Bharat / city

జియో ట్యాగింగ్​ విధానంతో నగదు పంపిణీ - ఆంధ్రాలో కరోనా డబ్బు న్యూస్

కరోనా వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో బియ్యం కార్డు లబ్ధిదారులకు ఏపీలో నగదు పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక సాయం రూ.1000 పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం ప్రారంభమైంది.

జియో ట్యాగింగ్​ విధానంతో కొనసాగుతున్న నగదు పంపిణీ

author img

By

Published : Apr 4, 2020, 1:52 PM IST

అమరావతి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరి, అనంతపురంతోపాటు పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల బియ్యం కార్డుల్లో మ్యాపింగ్‌ చేసిన 1.19 కోట్ల కార్డుదారులకు వాలంటీర్లు వారి ఇంటి వద్దకే వెళ్లి నగదు అందిస్తున్నారు. మ్యాపింగ్‌ కాని 13 లక్షల 12 వేల 890 బియ్యం కార్డుదారులకు వారి పరిధిలోని గ్రామ సంక్షేమ, విద్య సహాయకులు/వార్డు సంక్షేమ కార్యదర్శి అందించనున్నారు.

ప్రభుత్వ సాయం పక్కదారి పట్టకుండా జియో ట్యాగింగ్‌ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ముందుగా వాలంటీర్ల క్లస్టర్ల పరిధిలోని 50 కుటుంబాల వివరాలను వాలంటీర్ల పేరు మీద మ్యాపింగ్‌ చేశారు. వారికిచ్చిన ట్యాబ్‌లో జీపీఎస్‌ వ్యవస్థను పొందుపరిచారు. వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి జీపీఎస్‌ ఆన్‌చేసి బియ్యంకార్డులోని కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరిని ఇంటి ముందు నిల్చొబెట్టి ఫొటో తీస్తారు. లబ్ధిదారుల వివరాలతోపాటు ఇంటి పరిసర ప్రాంతమూ నమోదవుతుంది. ఇలా జియోట్యాగింగ్‌ చేసిన తర్వాత నగదు మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తున్నారు.

ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సామాజిక తనిఖీలో సులభంగా బయటపడేలా ఈ జియోట్యాగింగ్‌ విధానం ఉపకరిస్తుంది. ఒకవేళ సర్వర్‌ పనిచేయని సమయంలో ఆఫ్‌లైన్‌ ద్వారా పంపిణీ చేసేలా అప్లికేషన్‌ ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆయా గ్రామాల్లోనే వాలంటీర్లు పోర్టబులిటీ ద్వారా నగదు అందించనున్నారు. నగదు పంపిణీకి అవసరమైన రూ.1,300కోట్ల మొత్తాన్ని ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది.

ఇదీ చదవండి: నేటి నుంచి రూ.వెయ్యి నగదు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.