పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది.. సమ్మె, బంద్, పెన్‌డౌన్, చాక్‌డౌన్‌లాంటి నిరసన కార్యక్రమాల్ని నిర్వహించరాదని సంచాలకుడు చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనల్లో పాల్గొన్న కాలాన్ని నో వర్క్, నో పేగా పరిగణిస్తామని.. అలాగే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆ?న హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఉద్యోగులు, సంఘాల్లోని కొంతమంది.. ప్రవర్తన నియమాలను పాటించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, ప్రారంభ దశలోనే వీటిని తగ్గించాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్సీ అభ్యంతరం
సమస్యలు పరిష్కరించుకునే క్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు నిరసన తెలిపే హక్కు ఉందని, దీనిని ఎవరూ కాలరాయలేరని మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ విమర్శించారు. తక్షణమే ఈ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: