ETV Bharat / city

కరోనా వ్యాక్సిన్ ముందు, తర్వాత.. ఏవి తినాలి? ఏవి తినకూడదు?! - కరోనా వ్యాక్సిన్ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి

ఓవైపు కరోనా తన పని తాను చేసుకుపోతుంటే.. మరోవైపు దీని బారిన పడకుండా ఉండేందుకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా అరవై పైబడిన వారితో పాటు, 45 ఏళ్లు దాటిన వారికి కూడా టీకా ఇస్తోన్న సంగతి తెలిసిందే! అయితే ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయోనన్న భయం కొంతమందిలో ఉంటే.. అసలు వ్యాక్సిన్‌కి ముందు, తర్వాత ఏవైనా ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుందేమోనన్న సందేహం మరికొంతమందిలో ఉంది. ‘మీ సందేహం నిజమేనంటున్నారు’ నిపుణులు. ఎందుకంటే టీకా వేసుకోవడానికి ముందు, వేసుకున్న తర్వాత కొన్ని రకాల పదార్థాల్ని తీసుకోవడం వల్ల వ్యాక్సిన్‌ వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను చాలా వరకు తగ్గించచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా ఆహార నియమాలు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

healthy food for corona
కరోనా డైట్​
author img

By

Published : Apr 19, 2021, 7:18 PM IST

60 దాటిన వారికి, 45 ఏళ్లు పైబడి హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌, మూత్రపిండ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న వారికి రెండో దశ వ్యాక్సినేషన్‌లో టీకా ఇస్తోన్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకునే వారిలో పలు రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీకా వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయోనని, ఈ క్రమంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలోనని చాలామంది వ్యాక్సిన్‌ వేసుకోవడానికి భయపడుతున్నారు. అయితే కరోనా రెండో దశ విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత జాగ్రత్తలతో పాటు టీకా మనకు రక్షణ కవచంలా పని చేస్తోందని నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు.. వ్యాక్సిన్‌ వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాల గురించి భయపడద్దని, ఈ క్రమంలో మనం తీసుకునే ఆహార నియమాల్లో పలు మార్పులు-చేర్పులు చేసుకుంటే ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ని చాలా వరకు అడ్డుకోవచ్చని వారు సలహా ఇస్తున్నారు.

వీటిని తీసుకోవాల్సిందే!

foodsaftercaccination650-6.jpg
గ్రీన్ యాపిల్

* పాలకూర, తోటకూర, బ్రకలీ, గ్రీన్‌ యాపిల్‌.. వంటి ఆకుపచ్చ కాయగూరలు-ఆకుకూరలు-పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ‘ఎ’, ‘సి’, ‘కె’ విటమిన్లు, మెగ్నీషియం-పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంటే.. ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల వ్యాక్సిన్‌ వేసుకున్న భాగంలో వాపు, ఇతర శారీరక నొప్పుల నుంచి త్వరితగతిన ఉపశమనం పొందచ్చన్నమాట!
* రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యాల బారిన పడకుండా కాపాడే సుగుణాలు పసుపులో ఉన్నాయి. దీనిలోని యాంటీవైరల్‌, యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు నొప్పి నివారిణులుగా పనిచేస్తాయి. ఇక యాంటీ ఆక్సిడెంట్లు వాపును తగ్గించడంలో సహకరిస్తాయి. అందుకే దీన్ని కూరలతో పాటు సూప్స్‌, సలాడ్స్, టీ, స్మూతీస్‌లోనూ భాగం చేసుకోమంటున్నారు నిపుణులు.
* బోన్ బ్రాత్ (కోడి, మేక కాళ్లు/ఎముకల్ని ఉడికించడం ద్వారా తయారుచేసిన సూప్‌)లో ట్రిఫ్టోఫాన్‌ అనే అత్యవసర అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో సెరటోనిన్‌ ఉత్పత్తయ్యేలా చూస్తుంది. ఇది వ్యాక్సిన్‌ వల్ల ఎదురయ్యే అసౌకర్యాన్ని, మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే వ్యాక్సిన్‌కి ముందు, తర్వాత బోన్ బ్రాత్ తీసుకోవడం మంచిదన్నది నిపుణుల సలహా.

foodsaftercaccination650-5.jpg
బ్లూ బెర్రీస్

* వ్యాక్సినేషన్‌ తర్వాత ఎదురయ్యే నొప్పి, వాపు.. వంటి దుష్ప్రభావాలతో పాటు మానసిక ప్రశాంతతను అందించే శక్తి బ్లూ బెర్రీస్‌లో ఉంది. ఇవి శరీరంలో సెరటోనిన్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేసి టీకా కారణంగా మనకు ఎదురయ్యే అసౌకర్యాన్ని దూరం చేస్తాయి. ఈ పండ్లను పెరుగుతో కలిపి తీసుకుంటే అటు రుచికి రుచి.. ఇటు చక్కటి ఫలితం ఉంటుంది.
* వ్యాక్సినేషన్‌ వల్ల కొంతమందిలో వికారం, వాంతులు.. వంటి దుష్ప్రభావాలు సైతం తలెత్తచ్చంటున్నారు నిపుణులు. మరి, ఆ సమస్యకు దూరంగా ఉండాలన్నా / సత్వరమే వాటిని దూరం చేసుకోవాలన్నా అల్లం టీ చక్కటి ఔషధం అని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం, సాయంత్రం మనం సాధారణంగా తీసుకునే టీ/కాఫీలకు బదులుగా దీన్ని తీసుకోమని సలహా ఇస్తున్నారు.
* 65 ఏళ్లు పైబడిన వారు రోజుకు నాలుగైదు సార్లు పండ్లు/కాయగూరల్ని తీసుకోవడం వల్ల వారిలో రోగనిరోధక వ్యవస్థ పటిష్ఠమవుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ అలవాటు వారిలో టీకా వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాల్ని కూడా తగ్గిస్తుందని సలహా ఇస్తున్నారు.

foodsaftercaccination650-4.jpg
మెడిటేరియన్ డైట్

* ‘మెడిటేరియన్‌ డైట్‌’ ఫాలో అయ్యే వారిలో టీకా దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయట! ఎందుకంటే ఇందులో భాగంగా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలే దీనికి కారణమట! ఇక ఈ డైట్‌లో భాగంగా కాయగూరలు, పండ్లు, చేపలు, కోడిగుడ్లు, బీన్స్‌, ఆలివ్‌ ఆయిల్‌.. వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ తరహా డైట్‌ మీకు అలవాటు లేకపోయినా టీకా తీసుకోవడానికి కొన్ని వారాల ముందు నుంచి, వ్యాక్సిన్‌ తీసుకున్నాక కొన్ని వారాల దాకా దీన్ని పాటించినా సరిపోతుందట!

foodsaftercaccination650-1.jpg
నీటిశాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి

అందుకే నీళ్లు తాగాలట!

మహిళలు రోజుకు కనీసం 2.7 లీటర్ల నీళ్లు తాగాలని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసిన్ (ఐఓఎమ్‌) చెబుతోంది. అందులోనూ 20 శాతం నీరు మనం తీసుకునే ఆహారం (నీటి స్థాయులు అధికంగా ఉండే పండ్లు, కాయగూరల) రూపంలో అందడం వల్ల ఇటు శరీరం హైడ్రేట్‌ కావడంతో పాటు అటు ఆ పదార్థాల్లోని పోషకాలు సైతం మనకు అందుతాయంటోంది. ఇలా మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే నీరు వ్యాక్సినేషన్‌ వల్ల తలెత్తే పలు దుష్ప్రభావాలకు మనల్ని దూరంగా ఉంచుతుందని చెబుతోంది. అందుకే టీకా తీసుకోవడానికి ముందు, తర్వాత కూడా ఎప్పటిలాగే నిర్ణీత మొత్తంలో నీళ్లు తాగడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా శరీరంలో నీటి స్థాయులు పెరిగి రోగనిరోధక వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది. ఫలితంగా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌కి దూరంగా ఉండచ్చు.

ఇవి వద్దే వద్దు!

foodsaftercaccination650-2.jpg
వీటికి దూరం ఉండండి

* ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌లో ఉండే అధిక క్యాలరీలు, శ్యాచురేటెడ్‌ కొవ్వులు రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా టీకా వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు.
* టీకా తీసుకునే ముందు, తర్వాత ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. తద్వారా ఇటు శరీరానికి, అటు మనసుకు రెండింటికీ మంచిది. అయితే చక్కెరలు అధికంగా ఉండే పదార్థాలు ఈ ప్రశాంతతను దూరం చేస్తాయట! తద్వారా ఒత్తిడి, యాంగ్జైటీ.. వంటి మానసిక సమస్యలు పెరుగుతాయి. ఇవి అంతిమంగా నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.
* మద్యపానం చేసే వారు టీకా తీసుకోవడానికి కొన్ని వారాల ముందు నుంచి, తీసుకున్నాక కొన్ని వారాల తర్వాత దాకా ఈ అలవాటును పూర్తిగా దూరం పెట్టాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే మద్యం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంది. ఇది అంతిమంగా రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. తద్వారా టీకా వల్ల కలిగే దుష్ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యం శరీరానికి తగ్గిపోతుంది.

అలసట, నీరసం.. వంటి దుష్ప్రభావాలు టీకా తీసుకున్న చాలామందిలో తలెత్తుతున్నాయని, అందుకే వ్యాక్సినేషన్‌కు వెళ్లే ముందు శరీరానికి శక్తిని అందించే సమతులాహారం తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, ఏదో ఒక పండుని వెంటే ఉంచుకోవడం వల్ల ఈ నీరసం నుంచి తక్షణమే బయటపడచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూనే.. టీకా వల్ల ఇతర తీవ్రమైన అనారోగ్యాలు తలెత్తినా, ఈ సమస్యలు రోజుల తరబడి వేధించినా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదిస్తే తగిన చికిత్స చేయించుకోవచ్చు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కరోనా కల్లోలం..కొత్తగా 5,963 కేసులు, 27 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.