రాజ్యసభ సభ్యుడు, భాజపా నేత సుజనా చౌదరిపై ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. రాజధాని విషయంలో సుజనా... ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో మీడియాతో మాట్లాడిన ఆయన... సుజనా చౌదరి బ్యాంకుల దొంగ అని ఆరోపించారు. రాజధానిలో పవన్ పర్యటనపై ప్రశ్నల వర్షం గుప్పించారు. నాడు అమరావతి వచ్చి మజ్జిగన్నం తిన్న పవన్... ఇవాళ ఏం మాట్లాడుతున్నారో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు.
సుజనా చౌదరి బ్యాకుల దొంగ..అత్యంత అవినీతిపరుడు. భాజపాలో ఉండి తెదేపా కండువా కప్పుకున్న నేతలా..నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇష్టానుసారం మాట్లాడడం సరికాదు. అలాగే మాట్లాడితే నాలుక తెగ్గోస్తాం.
- దాడిశెట్టి రాజా, ప్రభుత్వ విప్
ఇదీ చదవండి : రాజధాని ఎక్కడున్నా సమస్యలేదు...కానీ..