పౌర హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపి గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పోలీసు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మానవహక్కుల పరిరక్షణకు సంబంధించిన గోడప్రతిని విడుదల చేశారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని డీజీపీ వివరించారు. పోలీసుల వైపు నుంచి మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పోలీసు వ్యవస్థలో మార్పులు చేపడుతున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఇదీ చదవండి: జగనన్న జీవ క్రాంతి పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్