పోలీసు ఉన్నతాధికారుల కోర్టు ధిక్కారం కేసు.. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 25వ తేదీకి వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలతో డీజీపి గౌతమ్ సవాంగ్ , హోం శాఖ సెక్రటరీ , ఐజీ మహేష్ చంద్ర, ఏలూరు డీఐజీ హైకోర్టుకు హాజరయ్యారు. ఎస్సై రామారావు పదోన్నతిపై కోర్టు ఆదేశాలను మూడు నెలలు గడిచినా ఎందుకు అమలు చేయలేదని డీజీపీని కోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. డీజీపీ ఈ కేసులో ఇకపై కోర్టుకు హాజరుకానవసరం లేదని స్పష్టం చేసింది.
రామారావు అనే పోలీసు అధికారి పదోన్నతి విషయంలో గతంలో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం పదోన్నతి జాబితాలో పేరు చేర్చాలని ఆదేశాలిచ్చింది. ఆదేశాలిచ్చినా అధికారులు పట్టించుకోవటం లేదంటూ రామారావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారించిన ధర్మాసనం నేడు డీజీపీ ,హోంసెక్రటరీ , ఐజీ మహేష్ చంద్ర హాజరుకావాలని గతంలో ఆదేశించింది.
ఇదీ చదవండి: ఒకేసారి ఎన్నికలు, వ్యాక్సినేషన్ సమస్యే: డీజీపీ గౌతమ్ సవాంగ్