యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావటం వల్ల కుటుంబ సమేతంగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, బాలాలయంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణాలు జరుగుతున్నాయి. కొండ కింద నిర్వహిస్తున్న సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొంటూ.. మొక్కులు తీర్చుకుంటున్నారు.
![devotees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10811882_nll-2.jpg)
పెద్ద ఎత్తున జనం తరలి రావటంతో ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్డు, ప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా స్వామివారి ధర్మ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించటం లేదు.
![devotees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10811882_nll-1.jpg)
ఇదీ చదవండి: వినూత్న రీతిలో ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే వ్యూహం..!