ధరల స్థిరీకరణ నిధి పేరుతో ఏర్పాటు చేసిన 3 వేల కోట్ల నిధులు ఏమయ్యాయని... మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థిరీకరణ నిధి ఏమైందో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో పంటలను కొనుగోలు చేసి ఉంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేదికాదన్నారు. తడిసిన ధాన్యం, దెబ్బతిన్న మామిడి, మొక్కజొన్న, తీగజాతి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని దేవినేని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : కరోనా వ్యాప్తి కట్టడికి 'కొవిడ్-19 ఏపీ ఫార్మా' యాప్