ETV Bharat / city

దమ్ముంటే కేబినెట్ భేటీ అమరావతిలో పెట్టండి: దేవినేని ఉమ

రాజధాని పేరిట వైకాపా రియల్​ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని, విశాఖలో భారీ ఎత్తున భూకుంభకోణం జరిగిందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో నీటిపారుదల శాఖను సర్వనాశనం చేశారన్నారు. ప్రాజెక్టులన్నీ నిలిపివేసి, రివర్స్ పాలన చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టులు నిలిపివేసి.. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఉద్ధరిస్తామని అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు.

Devineni umamaheswararao
దేవినేని ఉమామహేశ్వరరావు
author img

By

Published : Dec 25, 2019, 6:04 PM IST

విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్న దేవినేని ఉమ

రియల్​ఎస్టేట్ వ్యాపారం చేసుకోడానికి రాజధానిని తరలిస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అమరావతిలో తెదేపా నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో వైకాపా ఇన్​ సైడర్ ట్రేడింగ్​కు పాల్పడుతుందని ఆరోపించారు. విశాఖ భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిగితే వైకాపా నేతలు మళ్లీ జైలుకు వెళ్లడం తప్పదని హెచ్చరించారు.

విశాఖలో గత 7 నెలల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న దేవినేని.. భూములు కొన్నవారిపై తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజారాజధాని అమరావతిలోనే ఉంటుందని దేవినేని ఉమ స్పష్టం చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే అమరావతిలోనే మంత్రిమండలి భేటీ పెట్టాలని సవాలు చేశారు. కమిటీ వివరాలు అమరావతి సచివాలయంలోనే వెల్లడించాలన్నారు. ప్రజల ఆందోళనలను పట్టించుకోకుండా... ఎడారి, శ్మశానం, పెయిడ్ ఆర్టిస్టులని వైకాపా నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలన చేతకాక 7 నెలల్లోనే వైకాపా చేతులు ఎత్తేసిందని దేవినేని ఉమ ధ్వజమెత్తారు. వైకాపా అధికారం చేపట్టాక జలవనరుల ప్రాజెక్టులు నిలిచిపోయాయన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు ఎందుకు రద్దు చేశారని ఉమ ప్రశ్నించారు. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ ప్రాజెక్టులను ఎందుకు చేపట్టలేదన్నారు. ప్రాజెక్టులన్నీ నిలిపేసి.. ఇప్పుడు ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తామని వైకాపా నేతలు బయలుదేరారని ఉమ ఎద్దేవా చేశారు. తెదేపాపై కక్షతోనే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టులను పక్కన పెట్టేశారన్నారు. హంద్రీనీవా కాల్వల పనులు ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు.

రివర్స్ కాదు.. రిజర్వ్
వైకాపా అధికారంలోకి వచ్చాక నీటిపారుదల శాఖను నాశనం చేశారని దేవినేని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చెత్త పరిపాలన గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. రివర్స్ టెండరింగ్‌ పేరుతో అయినవాళ్లకు ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. అది రివర్స్ టెండరింగ్ కాదని... రివర్స్ పరిపాలన అని ఉమ ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో ప్రాజెక్టులకు రూ.72 వేల కోట్లు కేటాయించామని దేవినేని తెలిపారు. పోలవరం 30 శాతమే పూర్తయ్యిందని మంత్రులు అవాస్తవాలు చెబుతున్నారన్నారు. పోలవరంలో నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించలేదని దేవినేని ఉమ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :

సమరావతి: రాజధాని రైతుల జలదిగ్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.