ETV Bharat / city

''2 నెలల్లో భూరికార్డులు ప్రక్షాళన'' - video conference

జిల్లాల సంయుక్త కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూముల రీసర్వే జరుగుతున్న విధానంపై సమీక్షించారు. 2 నెలల్లో భూరికార్డుల ప్రక్షాళన చేపట్టాలని ఆదేశించారు.

2 నెలల్లో భూరికార్డులు ప్రక్షాళన : పిల్లి సుభాష్ చంద్రబోస్
author img

By

Published : Aug 21, 2019, 10:18 PM IST

2 నెలల్లో భూరికార్డులు ప్రక్షాళన : పిల్లి సుభాష్ చంద్రబోస్

రాష్ట్రంలో భూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయాలని.. వచ్చే రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అధికారులను ఆదేశించారు. భూముల రీసర్వే, ఇళ్ల స్థలాల పంపిణీపై సచివాలయం నుంచి అన్ని జిల్లాల సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేక సీఎస్ మన్మోహన్ సింగ్, కార్యదర్శి చక్రవర్తి, పీఎస్ గోవిందరాజులు, ఓఎస్డీ ఏవీ రామ్ ప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలు, భూముల రీసర్వే ముఖ్యమంత్రి ప్రాధాన్యత అంశాలన్న ఆయన అధికారులు ముందస్తుగా సిద్ధం కావాలని సూచించారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని వివరాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రతి వారం మండల అధికారులతో సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి ఆటంకాలు లేకుండా, పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. రికార్డుల్లో వ్యత్యాసాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నమోదు ప్రక్రియలో జాగ్రత్త వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో 8 మండలాలు ఒకటి చొప్పున ఒక ఆధునిక స్టోరేజ్ రూములను నిర్మించాల్సి ఉందని, ఆ ప్రక్రియను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి:

శేషాచలంలో "త్రినేత్రం"... ఇక వన్యప్రాణులు సురక్షితం!

Intro:AP_VSP_56_21_MANYAM LO VYDYA SADUPAYALU KALPINCHALI_AV_AP10153Body:విశాఖ మన్యంలో చింతపల్లి ఆసుపత్రికి అధనంగా 50 పడకలకు పెంచాలని ఉత్తరాంద్ర ఐక్యవేదిక కన్వినర్‌ , మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ డిమాండ్‌ చేఆరు. బుధవారం ఆయన చింతపల్లి ఏజెన్సీలో పర్యటించారు. ఈ సందర్భంగా చింతపల్లి సీహెచ్‌సీను సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలను తెలుసుకున్నారు. అనంతరం వైధ్యాధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యంలో వైద్యసేవలను మెరుగుపర్చడానికి ప్రభుత్వం చొరవతీసుకోవాలని, పాడేరులో వైద్యకళాశాల మంజూరుచేసిన ముఖ్యమంత్రి జగన్‌కు అభినందనలని ఆయన అన్నారు. ప్రస్తుతం మన్యంలో ఉన్న ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా వైద్యధికారి, సిబ్బందికి నివాసగృహాలు నిర్మించాలని కొణతాల డిమాండుచేశారు. చింతపల్లి, పాడేరు ఆసుపత్రులలో అధునాతన సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండుచేశారు. Conclusion:M RANMANARAO, SILERU,AP10153
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.