ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపటికి అదే ప్రాంతంలో తుపానుగా మారొచ్చని సూచించింది. 17 వరకు వాయువ్య దిశగా ప్రయాణించి, 18, 19 తేదీల్లో ఈశాన్య దిశగా ఉత్తర బంగాళాఖాతం వైపు కదలొచ్చని వివరించింది.
కోస్తాలో వర్షాలు...
మరఠ్వాడ నుంచి ఇంటీరియర్ కర్ణాటక వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో శుక్ర, శనివారాల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 43డిగ్రీలు నమోదు కావొచ్చని పేర్కొంది.
ఇదీ చదవండి: