ETV Bharat / city

పరిషత్‌ ఎన్నికల్లో మందకొడిగా ఓటింగ్ - పరిషత్‌ ఎన్నికల్లో మందకొడిగా ఓటింగ్

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గురువారం నిర్వహించిన పోలింగ్‌పై ఓటర్లు అంతగా ఆసక్తి కనబరచలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 60.78 శాతం పోలింగ్ నమోదైందని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 68.27 శాతం నమోదవ్వగా.. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 51.68 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు.

పరిషత్‌ ఎన్నికల్లో మందకొడిగా ఓటింగ్
పరిషత్‌ ఎన్నికల్లో మందకొడిగా ఓటింగ్
author img

By

Published : Apr 9, 2021, 3:39 AM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గురువారం నిర్వహించిన పోలింగ్‌పై ఓటర్లు అంతగా ఆసక్తి కనబరచలేదు. స్థానిక ఎన్నికల్లో ఎప్పుడూ దాదాపు 80 శాతం మేర జరిగే పోలింగ్‌.. ఈసారి కేవలం 60.91%గానే నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికల్లో 13 జిల్లాల్లో కలిపి 81.38% పోలింగ్‌ నమోదైంది. అప్పట్లో కంటే ఇప్పుడు 20.47 శాతం తక్కువగా ఓట్లేశారు. రాష్ట్రంలో ఏకగ్రీవాలు, అభ్యర్థులు మరణించిన స్థానాలు మినహా.. 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్‌ జరిగింది.

ఉదయం 7 గంటల నుంచి మందకొడిగా మొదలైనా.. మధ్యాహ్నం తర్వాత పెరుగుతుందని అధికారులు భావించారు. కానీ అది ఏ దశలోనూ మెరుగుపడలేదు. పశ్చిమగోదావరి జిల్లాలో గరిష్ఠంగా 68.27%, ప్రకాశం జిల్లాలో కనిష్ఠంగా 51.68% పోలింగ్‌ నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 81.78% మంది ఓటింగులో పాల్గొన్నా.. రెండు నెలల వ్యవధిలో నిర్వహించిన పరిషత్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తగ్గింది. పోలింగ్‌ ప్రారంభమైన మొదటి రెండు గంటల్లో కేవలం 7.76% నమోదైంది. 11 గంటలకు 21.65%, ఒంటిగంటకు 37.26%, 3 గంటలకు 47.42% పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

తెదేపా బహిష్కరణ ప్రభావం..
పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించాలన్న తెదేపా నిర్ణయం పోలింగ్‌పై ప్రభావం చూపింది. అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులు నామమాత్రంగానే బరిలో ఉన్నారు. అలాంటి చోట్ల పోలింగ్‌ తక్కువగా నమోదైంది. తెదేపా అభ్యర్థులు పోటీలో ఉన్నచోట పోలింగు శాతం మెరుగ్గా కనిపించింది.
* పంచాయతీ ఎన్నికల్లో భారీగా డబ్బు పంపిణీ జరిగిందని.. ఈసారి అంత ఇవ్వకపోవడంతో ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ముఖం చాటేశారని ప్రధాన పార్టీల నాయకులే చెబుతున్నారు.
* పరిషత్‌ పోలింగ్‌ విషయంలో చివరి వరకూ ప్రతిష్ఠంభన నెలకొంది. ఆపై ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తిగా జరగలేదు.
* గ్రామాల్లోనూ కరోనా కేసులు ఉద్ధృతం కావడంతో ఎక్కువమంది రాలేదు. వృద్ధులు, దివ్యాంగుల హాజరు ఈసారి తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

రీపోలింగ్‌ ఎక్కడంటే..
రాష్ట్రంలోని 3 జిల్లాల పరిధిలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో శుక్రవారం రీ పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈసీ నీలం సాహ్ని తెలిపారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేట, పణుకుపేటలోని 3 పోలింగ్‌ కేంద్రాల్లో గురువారం పోలింగ్‌ నిలిపివేశారని తెలిపారు. ‘అంటిపేట ఎంపీటీసీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎస్‌.నిర్మల పేరుకు బదులు నామినేషన్‌ వేసి ఉపసంహరించుకున్న ఎస్‌.లక్ష్మి పేరు బ్యాలెట్‌పేపర్‌పై ముద్రించడాన్ని గమనించిన సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పోలింగ్‌ నిలిపివేశారు.

నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం పొనుగుపాడులో ఒక పార్టీ ఏజెంట్‌ ఒకరు బ్యాలెట్‌ బాక్సును నీటితొట్టెలో వేయడంతో పోలింగ్‌ నిలిపివేశాం. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం పోలింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ పత్రాలు తారుమారయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో శుక్రవారం రీ పోలింగ్‌ నిర్వహిస్తున్నాం’ అని ఎస్‌ఈసీ తెలిపారు. గుంటూరు జిల్లా ఉయ్యందనలో రిగ్గింగ్‌పై కలెక్టర్‌ను నివేదిక అడిగామని, వచ్చాక రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ తెలిపారు. హైకోర్టు తీర్పు మేరకు ఓట్ల లెక్కింపుపై నిర్ణయం ఉంటుందని వివరించారు.

ఇదీ చదవండి: ఆ 4 రోజుల్లో రోజుకు 6 లక్షల చొప్పున వ్యాక్సినేషన్ జరగాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.