లాక్‌డౌన్ నేపథ్యంలో కాలినడకన స్వస్థలానికి వెళుతూ మార్గమధ్యలో వలస కార్మికుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లిలో గురువారం జరిగింది.
వరంగల్‌లో పెయింటర్, సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్న పరదేశ్ మండల్ లాక్‌డౌన్ కారణంగా పనులు లేక రెండ్రోజులుగా రైలుపట్టాల వెంట స్వస్థలం సిర్పూర్ కాగజ్‌నగర్‌కు కాలినడకన వెళ్తున్నాడు. బుధవారం పొత్కపల్లికి చేరుకున్నాడు. ఆకలితో అలమటిస్తున్న అతనికి స్థానిక నాయకుడొకరు ఆహారాన్ని అందించారు. అనంతరం రాత్రి పూట రైల్వేస్టేషన్‌లో నిద్రించారు. గురువారం స్టేషన్ సమీపంలో మృతదేహం ఉందని గుర్తించిన స్థానికులు రైల్వేపోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి పరిశీలించిన రైల్వే పోలీసులు కడుపునొప్పి, వడదెబ్బ కారణంగా మృతి చెంది ఉంటాడని భావించి.. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మరోవైపు ఓదెల తహసీల్దార్ సి.రామ్మోహన్ దీనిని అనుమానాస్పద మృతిగా పేర్కొంటూ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.
ఇదీ చూడండి: