ETV Bharat / city

Car theft: కార్లు అద్దెకు తీసుకుంటారు.. ఆ తరువాత అమ్మేస్తారు...

కారు యజమాని దగ్గరకు వెళతారు.. అధిక అద్దె ఇస్తామంటారు. కారు తీసుకొని ఆ తరువాత మార్కెట్లో అమ్మేస్తారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్​ పోలీసులు బ్రేకులు వేశారు. వీరి వద్ద 50కార్లు స్వాధీనం చేసుకున్నారంటేనే వీరంతా ఎంత కిలాడీలో అర్థమవుతుంది.

cp sajjanar talks about car frauds in hyderabad
కార్లు అద్దెకు తీసుకుంటారు.. ఆ తరువాత అమ్మేస్తారు...
author img

By

Published : Jun 14, 2021, 7:40 PM IST

కార్లు అద్దెకు తీసుకుంటారు.. ఆ తరువాత అమ్మేస్తారు...

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో కార్లు అద్దెకు తీసుకుని సగం ధరకే అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారి నుంచి 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు ఎక్కువ చెల్లిస్తామంటూ.. నిందితులు కార్లను అద్దెకు తీసుకుంటున్నారు. తరువాత బ్యాంకు సీజ్‌ చేసిందని, ప్రభుత్వం వేలం వేసిన వాహనాలంటూ ఆ కార్లను సగం ధరలకే అమ్ముతున్నారని పోలీసులు గుర్తించారు. నిందితులపై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయని.. జనవరిలో ఓ బాధితుడి చేసిన ఫిర్యాదుతో విషయం బయటపడిందని పేర్కొన్నారు. ఈ ముఠాలో పల్లె నరేష్ కుమార్ అనే వ్యక్తి కీలక వ్యక్తిని వెల్లడించారు.

తక్కువ ధర అని తొందరపడొద్దు..

ప్రజలు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు కొనేటప్పుడు.. అన్ని పత్రాలు సరిచూసుకోవాలని సీపీ సజ్జనార్ సూచించారు. వాహనాల వివరాలు ఆర్టీఏ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవాలని పేర్కొన్నారు. తక్కువ ధరకు వాహనాలు అమ్ముతుంటే అనుమానించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏదైనా అనుమానం వస్తే.. పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ఇదీ చదవండి:

3వేల సిమ్​ కార్డులతో భారీ స్కామ్​- 9 మంది అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.