ETV Bharat / city

'ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి సీఎస్ బదిలీ పరాకాష్ట'

ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వ నియంతృత్వ ధోరణకి ఇది నిదర్శనమని అన్నాయి. సీఎస్​ను ఆకస్మికంగా బదిలీ చేయడానికి గల కారణాలను సీఎం చెప్పాలని డిమాండ్ చేశాయి.

cs
author img

By

Published : Nov 4, 2019, 7:32 PM IST

'ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి సీఎస్ బదిలీ పరాకాష్ట'

తెదేపా...
సీఎస్‌ ఆకస్మిక బదీలిపై ముఖ్యమంత్రి జవాబు చెప్పాలని తెదేపా నేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. చెప్పిన పని చేయనందుకే బదిలీ చేసినట్లు భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహారంపై తెదేపా ఎంపీ కేశినేని నాని స్పందించారు. సీఎస్... ప్రిన్సిపల్ సెక్రటరీకి షోకాజ్ నోటీస్ ఇస్తే... తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎస్‌ను బదిలీ చేశారని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యకు సీఎం జగన్‌ పేరు ట్యాగ్ చేసిన కేశినేని నాని.. కంగ్రాట్యులేషన్స్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్య జోడించారు.

భాజపా...
సీఎస్ బదిలీపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి సీఎస్ బదిలీ పరాకాష్ట అని తెలిపారు. ముఖ్యమంత్రి చెప్పే వాటికీ, చేసేవాటికీ పొంతన లేదని ఆరోపించారు. బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తిని బదిలీ చేయడం నియంతృత్వమేనని పేర్కొన్నారు.

జనసేన...
కోరి తెచ్చుకున్న వ్యక్తి బదిలీ ఎందుకని జనసేన అధినేత పవన్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. సీఎస్.. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై జనసేన నేత, మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎస్​లకు కచ్చితమైన పదవీకాలం ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు అమలు చేసిందో చూడాలని అన్నారు.

మాజీ సీఎస్ ఐ.వై.ఆర్‌...
చీఫ్ సెక్రటరీ ఆకస్మిక బదిలీపై మాజీ సీఎస్ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు విస్మయం వ్యక్తం చేశారు. సీఎస్‌ను తొలగించే అధికారం సీఎంకు ఉన్నా... అనుసరించిన విధానం సరిగాలేదని పేర్కొన్నారు. బాధ్యత లేని అధికారం చలాయించే సీఎంఓ... సీఎంల మెడకు ఉచ్చులా చుట్టుకుంటుందని తెలిపారు. దేవాలయాల్లో అన్యమతస్తులను తొలగించినందుకు బహుమానమే బదిలీ అయితే అది దారుణమని అన్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.