పరిశ్రమల ప్రోత్సాహకాలు, అంతర్గత వాణిజ్యం అంశంపై... రెడ్యూస్ రెగ్యులేటరీ కంప్లైన్స్ బర్డెన్ డాష్ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ శాఖలు, కార్పోరేషన్లు, పరిశ్రమల్లో సేవలను సులభతరం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ సమీక్షించారు.
పాత పారిశ్రామిక చట్టాల్లో సంస్కరణలు, మార్పులపై ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చించారు. ఈనెల 20వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరుగనున్న నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలపై చర్చించనున్నట్టు సీఎస్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: