ప్రభుత్వం జీవో ఇచ్చి రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని జగన్ అనడం విడ్డూరంగా ఉందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే ఏపీ రాజధాని గురించి ప్రస్తావించారని ఆయన పేర్కొన్నారు. రాజధాని అవసరం లేనప్పుడు తాడేపల్లిలో ఎందుకు ఉంటున్నారో సీఎం సమాధానం చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో లేనప్పుడు మూడు రాజధానుల అవసరమేంటో జగన్ జవాబు చెప్పాలన్నారు. ఎన్నికైన ప్రభుత్వం ఏదైనా చేయవచ్చా అని ప్రశ్నించారు. వైకాపా ఎన్నికల ప్రణాళికలో అమరావతి నుంచి రాజధాని మార్చమని చెప్పారు.. ఇప్పుడు మీ పంతం నెగ్గించుకోవటం కోసం ఎంతకైనా వెళ్తారా అంటూ రామకృష్ణ నిలదీశారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తే మండలిని రద్దు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. శాసనమండలికి ఐదు కోట్లు ఖర్చు చేసేందుకు భారమంటున్న ప్రభుత్వం.. రాజధాని కేసులు వాదించే న్యాయవాదులకు రూ.5 కోట్లు ఎలా చెల్లిస్తారని అన్నారు.
ఇవీ చదవండి: