రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో లేని సమయంలో రాజధానిపై మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వరదల ప్రభావం రాజధానిలో తక్కువేనన్న రామకృష్ణ... అమరావతి అభివృద్ధి చేసేందుకు అనేక అవకాశాలున్నాయని తెలిపారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని సీపీఐ తరఫున డిమాండ్ చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వచ్చాక స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ కోరారు.
ఇసుక సమస్యపై
రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని సీపీఐ నేత రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సచివాలయంలో కలిసి.. వినతిపత్రం అందించారు. ఇసుక కొరత వలన భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కరవై ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇసుక ధరలు భారీగా పెంచడం వలన సామాన్య ప్రజలు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసి తక్కువ ధరకు ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు రామకృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి: