అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ రాజధాని మార్పు చేయవద్దని జగన్కు గట్టిగా చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పోరాటానికి ముగింపు పలికేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. అమరావతికి 5వేల ఎకరాలు చాలంటే కాదు... 30వేల ఎకరాలు కావాలని జగన్ కోరారని రామకృష్ణ గుర్తు చేశారు. 'మాట తప్పను మడమ తిప్పను' అని చెప్పుకునే జగన్ రాజధాని మార్పు ఉండదని ఎన్నికల ముందు పదే పదే చెప్పారన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి గౌరవించాలని రామకృష్ణ హితవు పలికారు. సచివాలయ ఉద్యోగులకు సీక్రెట్ బ్యాలెట్ పెట్టి అభిప్రాయ సేకరణ చేస్తే కచ్చితంగా అమరావతినే రాజధానిగా అంతా కోరుకుంటారన్నారు. అమరావతి పోరాట రూపం మారింది తప్ప పోరు ఆగలేదని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జగన్ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : 3 రాజధానులు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం: సీపీఎం