ETV Bharat / city

కేటీఆర్ వ్యాఖ్యలు కరక్టే.. సాక్ష్యాలతో సీపీఐ నారాయణ వివరణ

CPI Narayana: తెలంగాణ మంత్రి కేటీఆర్​ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. ఆంధ్ర- తమిళనాడు సరిహద్ధుల్లో పర్యటించి.. రెండు రాష్ట్రాల రోడ్లను పోల్చి ఆధారాలతో సహా ఏపీ స్థితిగతులను వివరించారు. తన స్వగ్రామంలో రోడ్ల పరిస్థితిని దృశ్యాలతో చూపించారు.

CPI national secretary Narayana
రోడ్లను చూపిస్తూ పరిస్థితిని వివరిస్తున్న సీపీఐ నేత నారాయణ
author img

By

Published : Apr 30, 2022, 9:34 AM IST

CPI Narayana: 'పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవు... రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి' అని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో సీపీఐ నేత నారాయణ ఏకీభవిస్తున్నానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లలో గతుకులు, గుంతలు మీదపై, అప్రకటిత విద్యుత్ కోతలు మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనన్నారు. కేటీఆర్ మాటలను ఏపీ మంత్రులు తప్పుబడుతున్న నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వయంగా ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో పర్యటించి ఆంధ్ర రోడ్ల స్థితిగతులను, తమిళనాడు పరిస్థితులతో పోల్చి ఆధారాలతో సహా వివరించారు. ఆంధ్రప్రదేశ్​లో రోడ్ల స్థితి గుంతలమయంగా ఉందని.. తమిళనాడు రోడ్లు చక్కగా ఉన్నాయని చూపించారు. రెండింటి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఘాటుగా విమర్శించారు. నగరి మండలం తన స్వగ్రామమైన అయణంబాకం గ్రామానికి వచ్చే రోడ్ల చూడండని దృశ్యాలతో సహా వెల్లడించారు.

రోడ్లను చూపిస్తూ పరిస్థితిని వివరిస్తున్న సీపీఐ నేత నారాయణ

కేటీఆర్​ ఏమన్నారంటే...?: KTR comments on AP: దేశంలో వ్యవసాయం తర్వాత ఆ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది నిర్మాణ రంగమేనని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆన్నారు. క్రెడాయ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ పరోక్షంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పరిస్థితిపై తన మిత్రులు చెప్పిన మాటలను ఆయన ప్రస్తావించారు.

‘‘పక్క రాష్ట్రంలో కరెంట్‌, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారు. అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు.. పక్క రాష్ట్రం వెళ్లి మీరే చూడండి. అక్కడికి వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు. కొన్ని మాటలంటే కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ.. అవి వాస్తవాలు’’ -కేటీఆర్, తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి

సంబధిత కథనాలు:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.