నరసాపురం ఎంపీ రఘురామకు బెయిల్ మంజూరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. వైకాపా నుంచి బీ-ఫారం తీసుకుని పోటీచేసి గెలిచిన ఎంపీపై.. అదే పార్టీ అధికారంలో ఉండి రాజద్రోహం కేసు పెట్టడాన్ని విచిత్ర చర్యగా అభిప్రాయపడ్డారు. ఛార్జ్‌షీట్, అఫిడవిట్‌ను పరిశీలించగా.. ప్రభుత్వాన్ని ఆయన పలుమార్లు దూషించినట్లు అందులో పేర్కొన్నారని చెప్పారు. ఆయన దూషణలను సమర్థించడం లేదంటూనే.. ప్రభుత్వాన్ని కూలుస్తానని ఎంపీ ఎక్కడా అనలేదని గుర్తుచేశారు. రఘురామ కామెంట్లపై రాజద్రోహం కేసు పెట్టడానికి అవకాశం లేదని భావిస్తున్నట్టు నారాయణ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: