ETV Bharat / city

'పాజిటివ్‌'తో ప్రయాణం.. పక్కవారికీ ప్రమాదం! - ap latest news

స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించినా.. పాజిటివ్​గా నిర్దారణ అయిన తర్వాత పలువురు స్వగ్రామలకు ప్రయాణమవుతున్నారు. ఈ ప్రయాణాలతో వారి ప్రాణాల మీతికి తెచ్చుకోవటమే గాక.. ఇతరులనూ ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలాంటివారు దారి పొడవునా కొవిడ్‌ వ్యాప్తి వాహకులుగా మారుతున్నారు.

కరోనాతో ప్రయాణం
కరోనాతో ప్రయాణం
author img

By

Published : May 24, 2021, 7:12 AM IST

Updated : May 24, 2021, 10:12 AM IST

కరోనా లక్షణాలు కనిపించగానే చాలామంది ఎలాగైనా సరే సొంతూళ్లకు వెళ్లిపోవాలని రైళ్లలోనో, బస్సుల్లోనో బయల్దేరిపోతున్నారు. ఉద్యోగం - ఉపాధి కోసమో, ఇతర అవసరాలతోనో సొంతూళ్లను వదిలి పట్టణాల్లో నివసిస్తున్నవారిలో కొందరు కొవిడ్‌ అని తెలియగానే.. ఉన్నచోటే తగిన చికిత్స తీసుకోకుండా స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఇలా తమ ప్రాణాలపైకి తెచ్చుకోవటమే కాక.. ఇతరులనూ ప్రమాదంలోకి నెడుతున్నారు. రైళ్లు, బస్సుల్లో, సొంతంగా కిరాయి మాట్లాడుకున్న వాహనాల్లో ప్రయాణిస్తూ వైరస్‌ వ్యాప్తికి వాహకాలుగా మారిపోతున్నారు.

ఈ ధోరణి ఇటీవల బాగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌ పాజిటివ్‌ కావడంతో అప్పటికే వారి ఆరోగ్య పరిస్థితి తీవ్రమై ఉండటం, అది గమనించే అవగాహన వారికి లేకపోవటంతో మొండిగా ప్రయాణం చేస్తున్నారు. కొందరు మార్గమధ్యలోనే ప్రాణాలూ కోల్పోతున్నారు. కొవిడ్‌ బాధితులకే కాకుండా ఆ రైలు, బస్సులో ఉన్నవారందరికీ ఇది ముప్పుగా పరిణమిస్తోంది. ఇటీవల కాలంలో ఒక్క వాల్తేర్‌ డివిజన్‌ పరిధిలోనే దాదాపు ఏడుగురు ఇలా చనిపోయారు.

ఒడిశాకు చెందిన హరిహరపాత్రో (64) సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు సికింద్రాబాద్‌లో బయల్దేరారు. రైలు విశాఖపట్నం చేరేసరికి ఆయన ప్రాణాలొదిలారు. తోటి ప్రయాణికుల సమాచారంతో వైద్యులు వచ్చి పరిశీలించి, ఆయన కొవిడ్‌తో మృతి చెందినట్లు తేల్చారు. ఒడిశాలోని బాలాసోర్‌కు చెందిన నవీన్‌కుమార్‌ రౌత్‌ పుదుచ్చేరి- భువనేశ్వర్‌ ప్రత్యేక రైలులో ప్రయాణిస్తూ విశాఖపట్నం సమీపంలో మృతి చెందారు. ఆయన జేబులో ఉన్న పత్రాల్ని పరిశీలిస్తే కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. నిత్యం ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

పదుగురినీ ప్రమాదంలోకి నెడుతున్నారు..

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో ఉంటున్న ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలవారితో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారు కొందరు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించినా లేదా కొవిడ్‌ నిర్ధారణైనా ఆ విషయం దాచిపెట్టి ప్రయాణాలు చేసేస్తున్నారు. వీరి వల్ల సహ ప్రయాణికులూ ప్రమాదంలో పడిపోతున్నారు. బస్సుల్లో పదుల సంఖ్యలో, రైళ్లల్లో అయితే వందల మంది ప్రయాణికులు ఉంటారు. తమ పక్కనున్న వ్యక్తి పాజిటివో కాదో కూడా తెలియక వీరు వైరస్‌ బారిన పడుతున్నారు.

పాజిటివ్‌ ఉన్నవారు ఇలా స్వస్థలాలకు వెళ్లటం వల్ల అక్కడ వారి కుటుంబసభ్యులకూ ముప్పు తప్పట్లేదు.రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల వరకూ బస్సులు, ఆటోలు తిరుగుతున్నాయి. స్టేషన్‌లో రైలు దిగిన తర్వాత బస్సుల్లోనో లేదా ప్రైవేటు వాహనాల్ని మాట్లాడుకునో ఇళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడా తోటి ప్రయాణికులకు ఇబ్బంది తప్పట్లేదు. మరికొంతమందైతే కార్లు, ఇతర వాహనాల్లో కుటుంబాలతో స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. ఇలాంటివారు దారి పొడవునా కొవిడ్‌ వ్యాప్తి వాహకులుగా మారుతున్నారు.

ప్రధాన కారణాలివే....

* తాము నివసిస్తున్న నగరాలు, పట్టణాల్లోని ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స చేయించుకునేందుకు ఎక్కువ ఖర్చవుతుందనే భయం.

* సొంతూరికి వెళ్లిపోతే కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య ధైర్యంగా ఉండొచ్చనే ధీమా.

* పెళ్లికాని యువతకు కొవిడ్‌ నిర్ధారణైతే.. వారికి అక్కడ సేవలందించేవారు లేకపోవడం, ఒంటరిగా ఉండలేకపోవటం.

* కరోనా లక్షణాలు మొదలైన తర్వాత బాధితుల్లో విపరీతమైన నీరసం ఉంటోంది. ఒంటరిగా నగరాల్లో ఉంటున్నవారు కొందరు సొంతంగా పనులు చేసుకోలేక, సాయమందించేవారు లేక తప్పనిసరి పరిస్థితుల్లో పాజిటివ్‌ ఉండగానే ప్రయాణం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గింది: ఏకే సింఘాల్

Last Updated : May 24, 2021, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.