తెలంగాణలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య మరింత పెరిగింది. తాజాగా 28 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 531కి చేరింది. ఆదివారం కరోనాతో మరో ఇద్దరు మృతి చెందగా.. మృతుల సంఖ్య 16కు చేరుకుంది. చికిత్స పొందుతున్న వారిలో నిన్న మరో ఏడుగురు కోలుకుని డిశ్చార్జ్ కాగా.. మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 103కి చేరింది.
ఇదీ చూడండి