రాష్ట్ర సచివాలయంలో ఒకరికి కరోనా పాజిటివ్ రావటం వల్ల ఉద్యోగ సంఘాలు అప్రమత్తమయ్యాయి. అన్ని శాఖల సిబ్బందికి పరీక్షలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు నేటి నుంచి రెండు, మూడు రోజుల పాటు సచివాలయంలోని ఉద్యోగులకు కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు చేయనున్నారు. మరోవైపు సచివాలయంలోని నాలుగో బ్లాక్లో విధులు నిర్వహించే వ్యవసాయ శాఖ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోం చేయాలని...ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు ఇచ్చారు. ఆ శాఖకు చెందిన ఉద్యోగికే కరోనా పాజిటివ్ అని తేలటంతో... అతనితో పనిచేసిన వ్యవసాయ శాఖ ఉద్యోగులందరినీ 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. జూన్ 1 తేదీ నుంచి 14 తేదీ వరకూ వారెవరూ సచివాలయానికి హాజరు కానవసరం లేదని.. ఇంటి నుంచే విధులు నిర్వహించాలని ఆమె ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సచివాలయంలో కరోనా కలకలం... హోంక్వారంటైన్కు వ్యవసాయ శాఖ ఉద్యోగులు