పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నిబంధనలు రైతులకు ఇబ్బందికరంగా మారాయి. ఈ-పంట నమోదులో అన్ని వివరాలు సమగ్రంగా ఉన్నప్పటికీ మళ్లీ రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే కొంటున్నారు. ఈపంట నమోదు సమయంలో ఉన్న రైతు.. రిజిస్ట్రేషన్ సమయంలోనూ ఉండాల్సి రావడం వంటి నిబంధనలు ప్రతిబంధకమయ్యాయి. ఈపంటలో అన్ని వివరాలు ఉన్నందున రైతు ఆధార్‌కార్డు ఆధారంగా కొనుగోలు చేసే వెసులుబాటునివ్వాలని వారు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 65వేల మంది రైతులు మాత్రమే రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకున్నారు. వీరిలో 11వేల మంది మాత్రమే పత్తి విక్రయించారు. పత్తి సాగుదారుల సంఖ్యలో ఇది నామమాత్రం.
- క్వింటా పత్తికి మద్దతు ధర
- పొడవు పింజ రూ.5825
- పొట్టి పింజ రూ.5725
తేమ 8% ఉంటే క్వింటాకు రూ.5825 మద్దతు ధర లభిస్తుంది. 8% కంటే ఎక్కువుంటే ప్రతి ఒక్క శాతానికి రూ.58.25 చొప్పున సీసీఐ ధర తగ్గిస్తోంది. 12% కంటే తేమ ఎక్కువగా ఉంటే కొనుగోలు చేయరు.
డిసెంబరు నాలుగోతేదీ వరకు పరిస్థితి
* రాష్ట్రంలో సీసీఐ ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలు: 53
* కొనుగోలు చేసిన పత్తి బేళ్లు: 67,940
* మద్దతు ధర ప్రకారం రైతులకు చెల్లించిన సొమ్ము: రూ.201.3కోట్లు
* రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం: 15 లక్షల ఎకరాలు
* రాష్ట్రం మొత్తం ఉత్పత్తయ్యే పత్తి అంచనా: 24.54 లక్షల బేళ్లు
* లబ్ధి పొందిన రైతులు: 11056
* ఎకరాకు సగటున వ్యవసాయశాఖ అంచనా ప్రకారం ఉత్పత్తి: 9 క్వింటాళ్లు
ఇదీ చదవండి: